Author: Editor's Desk, Tattva News

వివిధ దేశాల సైనిక వ్యయాలతో పోల్చి చూసినట్లైతే అమెరికా, ప్రపంచ భద్రతకు అతిపెద్ద ముప్పుగా తయారైందని చైనా ఆందోళన వ్యక్తం చేస్తున్నది. జీవాయుధ ప్రయోగశాలలకు నిధులు సమకూర్చడం ద్వారా, యుద్ధాలను రెచ్చగొట్టడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సంక్షోభాలను పెచ్చరిల్లేలా చేయడంలో అమెరికా కీలకపాత్ర పోషిస్తోందని చైనా అధికారిక వార్త పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది. అమెరికా తన గుత్తాధిపత్యాన్ని కొనసాగించుకునేందుకుగానూ ఏళ్ల తరబడి ప్రపంచవ్యాప్తంగా సంక్షోభాలను ఎలా రెచ్చగొట్టిందీ అందులో వివరించింది. అమెరికా 240 ఏళ్ల చరిత్రలో కేవలం 16 సంవత్సరాలు మాత్రమే ఎలాంటి యుద్ధం లేకుండా వుందని ఆ వ్యాసం పేర్కొంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన నాటి నుండి ప్రపంచంలో కెల్లా అమెరికా అత్యంత శక్తివంతమైన దేశంగా మారింది. అప్పటి నుండి 2001 వరకు ప్రపంచవ్యాప్తంగా 153 ప్రాంతాల్లో జరిగిన 240 సాయుధ ఘర్షణల్లో 201 ఘర్షణలను అమెరికానే ప్రారంభించింది. ఉక్రెయిన్‌లో బయలాజికల్‌ లేబరేటరీల నిర్వహణ కోసం 20 కోట్ల డాలర్లకుపైగా…

Read More

ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా వైరస్‌ మానవ శరీర అవయవాలపై, వారి రోగ నిరోధకశక్తిపై, శ్వాస వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపు తోనే ఉంది. తాజాగా పురుషుల పునరుత్పత్తి వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోందని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ఎసిఎస్‌ ఒమేగా పత్రిక ఈ వివరాలను అందించింది.పురుషుల పునరుత్పత్తి అవయవాల్లో కరోనా వైరస్‌ ఉనికి ఉంటున్నట్టు ఇటీవల కొన్ని ఆధారాలు లభ్యమైన క్రమంలో మగవారి పునరుత్పత్తి వ్యవస్థపై కరోనా మహమ్మారి ప్రభావం చూపుతుందా? అన్న విషయాన్ని కనుగొనేందుకు ఐఐటి-బాంబే, ముంబయిలోని జస్‌లోక్‌ ఆసుపత్రి-పరిశోధన కేంద్రం నిపుణులు పరిశోధనలు చేపట్టారు.ఇందులో భాగంగాకరోనా నుంచి కోలుకున్న 17 మంది, ఇన్‌ఫెక్షన్‌ సోకని సంపూర్ణ ఆరోగ్యవంతులైన మరో 10 మంది పురుషుల వీర్యంలోని ప్రొటీన్ల స్థాయులను విశ్లేషించారు. వీరంతా వంధ్యత్వం లేని 20-45 ఏళ్ల వయసు వారేనని పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధనలో ఇన్‌ఫెక్షన్‌ కారణంగా స్వల్ప, మధ్యస్థాయి లక్షణాలే కనిపించినా వారి సంతానోత్పత్తిని మాత్రం గట్టిగానే…

Read More

సుమారు 51 బిలియన్‌ డాలర్ల విదేశీ రుణాలను చెల్లించలేమని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. విదేశీ రుణాలతో పాటు ఇతర రుణాలను డిఫాల్ట్‌గా ప్రకటించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ఆర్థిక సహాయం అందించడానికి ముందు విదేశీ ప్రభుత్వాల నుండి రుణాలతో సహా అన్ని బాధ్యతల నుండి దేశం నిష్క్రమించనుందని శ్రీలంక ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశ ఆర్థిక పరిస్థితి మరింత క్షీణించకుండా నిరోధించడానికి చివరి ప్రయత్నంగా ప్రభుత్వం అత్యవసర చర్యను తీసుకుందని ఆ శాఖ తెలిపింది. తీవ్ర ఆర్థిక, ఆహార, ఇంధన కొరతతో అల్లాడుతోన్న శ్రీలంకలో పరిస్థితులు మరింత దిగజారకుండా ఉండేందుకు తాజా చర్యలు చేపట్టామని తెలిపింది. రుణదాతలు తమకు చెల్లించాల్సిన రుణాలను క్యాపిటలైజ్‌ చేసుకోవచ్చు లేదా శ్రీలంక రూపాయిల్లో చెల్లింపును ఎంచుకోవచ్చని వెల్లడించింది. రుణాల చెల్లింపులు సవాళ్లతో కూడుకున్నదే కాకుండా అసాధ్యం అనే స్థితికి చేరిపోయామని, రుణాలను పునర్నిర్మించడంతోపాటు పూర్తి డీఫాల్ట్‌ను నివారించడమే ప్రస్తుతం తీసుకోగలిగిన ఉత్తమ…

Read More

ప్రత్యక్ష చర్చల ద్వారానే ఉక్రెయిన్ యుద్దానికి ముగింపు పలకగలమని భారత ప్రధాని  నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.  అమెరికా అధ్యక్షులు జో బైడెన్‌ తో సోమవారం వర్చువల్‌గా జరిగిన భేటీలో  రష్యా-ఉక్రెయిన్‌ మధ్య సంక్షోభం ముగించడానికి, ప్రపంచ ఆహార సరఫరా, వస్తువుల మార్కెట్లపై అస్థిరత ప్రభావాన్ని అంతం చేయడానికి ఇరు దేశాల అధ్యక్షుల మధ్య ప్రత్యేక చర్చలే మార్గమని  ప్రధాని  తెలిపారు.  రష్యా అధ్యక్షులు పుతిన్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షులు జెలెన్‌స్కీతో జరిపిన ఫోన్‌ సంభాషణల్లోనూ ఇదే విషయాన్ని తెలిపినట్లు చెప్పారు. ఉక్రెయిన్‌లో పరిస్థితి ప్రధానంగా, బుచా నగరంలో అనేకమంది మహిళలు, చిన్నారులు, పౌరులు హత్య చేయబడ్డారని వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. . మరణాలను భారత్‌ తక్షణమే ఖండించిందని, స్వతంత్ర దర్యాప్తునకు పిలుపునిచ్చిందని తెలిపారు. ‘నేను అనేకసార్లు అధ్యక్షులిద్దరితో మాట్లాడాను, శాంతి కోసం విజ్ఞప్తి చేయడమే కాకుండా నేరుగా చర్చలు జరపాలని సూచించాను. మా దేశ పార్లమెంట్‌లోనూ ఉక్రెయిన్‌పై విస్తృతంగా చర్చించాం.…

Read More

ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన నిరసన దీక్షతో ఢిల్లీ దద్దరిల్లింది. సంవత్సరం పాటు సాగు చట్టాలకు నిరసనగా ఢిల్లీ శివారులలో జరిపిన నిరసనల అనంతరం అక్కడ జరిగిన అతిపెద్ద రైతుల నిరసన అని చెప్పవచ్చు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఒకటే చెబుతున్నా ఎవరితోనైనా పెట్టుకోండి కానీ రైతులతో కాదని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ కేంద్రానికి 24 గంట‌ల డెడ్‌లైన్ విధించారు. 24 గంట‌ల్లోపు ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఆయన డిమాండ్ చేశారు. దేశంలోని రైతులు భిక్ష‌గాళ్లు కాదు.. ఒకే విధానం లేక‌పోతే రైతులు రోడ్ల‌పైకి వ‌స్తార‌ని కెసిఆర్ హెచ్చరించారు. బోర్ల దగ్గర మీటర్లు పెట్టాలని షరతు పెడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే ప్రతిపక్షాలపై ఇడి, ఐటి అంటూ బెదిరిస్తారా? చురకలంటించారు. బిజెపిలో…

Read More

అవిశ్వాస తీర్మానం ద్వారా ఇమ్రాన్ ఖాన్ ప్రధాన మంత్రి పదవిని కోల్పోయిన తర్వాత, జాతీయ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆ పదవికి ఎన్నుకోవడంతో గత రాత్రి కొత్త ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన షెహబాజ్ షరీఫ్ పాకిస్థాన్ కు మూడు సార్లు ప్రధానిగా పనిచేసిన అన్న నవాబ్ షరీఫ్ మద్దతుతోనే ఆ పదవి చేపట్టగలిగారనడంలో సందేహం లేదు.  అయితే  ప్రస్తుతం అవినీతి కేసులో జైలు శిక్షకు గురై, ప్రవాసంలో లండన్ లో గడుపుతున్న నవాబ్ షరీఫ్  కు కొత్త ప్రధానిగా  తన తమ్ముడైన,  పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పిఎంఎల్-ఎన్) పార్టీ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ ను చేయడం మొదటి ప్రాధాన్యత కాదని తెలుస్తున్నది.  2017లో మూడుసార్లు ప్రధానిగా ఉన్న నవాజ్ షరీఫ్‌ను సుప్రీం కోర్టు పదవీచ్యుతుడ్ని చేసినప్పుడు, మిగిలిన 10 నెలల ప్రధానమంత్రి పదవికి షెహబాజ్ కంటే తన పార్టీ నాయకుడు షాహిద్ ఖాకాన్ అబ్బాసీకి ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. ఇప్పుడు కూడా తన రాజకీయ వారసురాలిగా కుమార్తె…

Read More

సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు గ్రామ పంచాయతీల సమగ్రాభివృద్ధి అత్యంత కీలకమని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇందుకోసం భాగస్వామ్య పక్షాలన్నీ ప్రత్యేకమైన కార్యాచరణతో ముందుకెళ్లాలని ఆయన సూచించారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ‘లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్’ ఇతివృత్తంతో జరిగిన జాతీయ సదస్సులో పాల్గొంటూ భారతదేశం నుంచి పేదరికాన్ని నిర్మూలించడం మనముందున్న అతిపెద్ద, ముఖ్యమైన సమస్య అని తెలిపారు. బాలలు, బాలికలకు సమానమైన విద్యనందించడం, అందరికీ స్వచ్ఛమైన తాగునీరు, పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు అందరికీ సమానమైన ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా కీలకం అని నాయుడు చెప్పారు. గ్రామరాజ్యం లేని రామరాజ్యం అసంపూర్ణమన్న మహాత్ముని మాటలను ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి గుర్తు చేశారు. పేదరికం లేని, పరిశుభ్రమైన, విద్య, వైద్యం అందుబాటులో ఉన్న చిన్నారులకు అనుకూల వాతావరణం కలిగిన, సామాజిక భద్రత కలిగిన, సుపరిపాలన కలిగిన గ్రామాలను నిర్మించుకున్నప్పుడే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను…

Read More

తెలంగాణాలో తాగు నీటి ఎద్దడితో  ఎండాకాలంలో తాగు నీరు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కేసీఆర్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ధ్వజమెత్తారు. తాగేందుకు నీరు దొరక్క రాష్ట్రంలో చాలా చోట్ల ప్రజలు అవ‌స్తలుప‌డుతున్నారని, పల్లెవాసులు శివార్లలోని బోరుబావుల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.  తెలంగాణ‌లో తాగునీటి సమస్య తీర్చేందుకు కేసీఆర్ స‌ర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని చెబుతూ మిషన్‌ భగీరథ ఉన్నా  ప్రజలకు మాత్రం నీళ్ల కోసం పరేషాన్‌ తప్పడం లేదని ఆమె  విమర్శించారు.  ఈ పథకం ద్వారా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీల్లోని 23,775 ఆవాసాల్లో 54,06,070 ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చి మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయని విజయశాంతి…

Read More

శ్రీరామనవమి పర్వదినాన దేశంలో పలు రాష్ట్రాల్లో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఢిల్లీ, జార్ఖండ్‌, బెంగాల్లో ఈ ఘర్షణలు జరిగాయి. మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్‌ ప్రాంతంలో శ్రీరామ నవమి ఉత్సవాల్లో గొడవలు చోటుచేసుకున్నాయని, దీంతో ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించినట్లు సీనియర్‌ ఉన్నతాధికారి  ఒకరు తెలిపారు.  ఆ ప్రాంతంలో భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. తలాబ్‌ చౌక్‌ ప్రాంతం నుండి ప్రారంభమైన ఊరేగింపు సందర్భంగా లౌడ్‌ స్పీకర్లను అమర్చగా, దీనిపై ఘర్షణ జరిగి రాళ్లు రువ్వడం, వాహనాలను తగుల బెట్టడం వరకు వెళ్లిందని అదనపు కలెక్టర్‌ ఎస్‌ఎస్‌ మజుల్దే తెలిపారు.  పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు టియర్‌ గ్యాస్‌లను వినియోగించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. పలు ఇళ్లకు సైతం నిప్పంటించారని చెప్పారు. ఈ ఘర్షణల్లో ఎస్‌పితో సహా పలువురు పోలీసులు గాయపడ్డారు. గుజరాత్‌లోని ఆనంద్‌ జిల్లా ఖంబాట్‌, సబర్‌కాంత జిల్లా హిమ్మత్‌నగర్‌లలో మత ఘర్షణలు చోటుచేసుకున్నాయని వార్తలు వెలువడ్డాయి. ఖంబాట్‌లో రెండు గ్రూపుల మధ్య…

Read More

 పాకిస్థాన్ పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ద్వారా పదవీచ్యుతుడవడానికి కొద్దీ సేపు ముందు ఇమ్రాన్ ఖాన్ తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వాను తొలగించడానికి చివరి ప్రయత్నం చేసిన్నట్లు తెలుస్తున్నది.  ఆ ప్రయత్నం పసిగట్టిన బజ్వా స్వయంగా ఇమ్రాన్ ను కలసి `హెచ్చరించిన్నట్లు’ భావిస్తున్నారు. అటువంటి ప్రయత్నం ఏదైనా చేస్తే, అడ్డుకోవడం కోసమే అర్ధరాత్రి హైకోర్టు, సుప్రీం కోర్టులు సమావేశమైన్నట్లు కూడా చేస్తున్నారు. పాకిస్థాన్ చరిత్రలో ప్రధానులు ఎవ్వరు పూర్తికాలం పదవిలో కొనసాగలేదు.  అయితే సైన్యం లేదా న్యాయస్థాన పక్రియ ద్వారా కాకుండా  ప్రజాస్వామ్య ప్రకియలో మొదటిసారిగా పదవి పోగొట్టుకున్నది ఇమ్రాన్ కావడం విశేషం.  రాజకీయ నాయకుడిగా మారిన క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్  చైనాతో అతని సాన్నిహిత్యం, అమెరికాతో వైరుధ్యాలతో పాటు తనను అధికారంలోకి తీసుకొచ్చిన సైన్యం పట్ల కొన్ని సందర్భాలలో ధిక్కార ధోరణి ప్రదర్శించడం వల్లననే అధికారం కోల్పోయిన్నట్లు పలువురు భావిస్తున్నారు. పాకిస్థాన్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా తీవ్రమైన రీతిలో ఎన్నికలలో రిగ్గింగ్ కు పాల్పడడం ద్వారా, సైన్యం…

Read More