Author: Editor's Desk, Tattva News

రాష్ట్ర హైకోర్టు విధించిన ఆరు నెలల గడువులో రాష్ట్ర రాజధాని నగరం అమరావతిని అభివృద్ధి చేయడం సాధ్యం కాదని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆ గడువును ఐదేళ్లకు పొడిగించాలని కోరుతూ హైకోర్టులో అఫిడవిట్ ను దాఖలు చేసింది.  “ఆరు నెలల గడువులో రాజధాని నగరం, రాజధాని ప్రాంతంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడం సాధ్యపడదు. రాజధాని నగర అభివృద్ధికి అవసరమైన రోడ్లు, విద్యుత్‌, తాగునీరు, మురుగు పారుదల తదితర మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలంటే కనీసం 60 నెలలు పడుతుంది” అంటూ అందులో స్పష్టం చేసింది. రాజధాని నగరం, ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఏళ్ల సమయం పడుతుందని పేర్కొంటూ అందువల్ల రాజధాని నగరాన్ని మాత్రమే అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏకు అనుమతివ్వాలని విన్నవించింది. రాజధాని ప్రాంతం అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని తెలుపుతూ  అందువల్ల కాలం, నిధులు, అభివృద్ధి కోణంలో నిర్ణీత కాలంలో రాజధాని అభివృద్ధిని పూర్తి చేస్తామని…

Read More

ఆస్ట్రేలియాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం వల్ల ఇరు దేశాలు ఇప్పుడున్న అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవడానికి వీలు కలగడంతో పాటుగా విద్యార్థులు, ప్రొఫెషనల్స్, పర్యాటకుల మార్పిడికి వీలు కలుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం వర్చువల్‌గా జరిగిన ఒక కార్యక్రమంలో భారత్, ఆస్ట్రేలియా ప్రధానులు నరేంద్ర మోదీ, స్కాట్‌మారిసన్‌ల సమక్షంలో ఇరు దేశాల వాణిజ్య మంత్రులు పీయూష్ గోయల్, డాన్ టెహాన్‌లు ‘ ఇండియా ఆస్ట్రేలియా ఎకనమిక్ కో ఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేశారు. ఇంత తక్కువ సమయంలో ఈ ఒప్పందం కుదరడం ఇరుదేశాల మధ్య పరస్పర విశ్వాసానికి నిదర్శనమని ప్రధాని మోదీ తెలిపారు. ఇరు దేశాలు ఒకరి అవసరాలు మరొకరు తీర్చడానికి ఎంతో అవకాశముందని, ఆ అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని ఆయన భరోసా వ్యక్తం చేశారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య పెరుగుతున్న సంబంధాలకు ఈ ఒప్పందం మరో మైలురాయని…

Read More

ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై పోప్‌ ఫ్రాన్సిస్‌ మొదటిసారిగా  తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉక్రెయిన్‌పై పుతిన్‌ దాడిని పోప్‌ పరోక్షంగా ఖండించారు. జాతీయవాద ప్రయోజనాల కోసం ఘర్షణలు చేస్తున్నారని విమర్శించారు.  మాస్కో ఫిబ్రవరి 24న ప్రారంభించిన ఈ చర్య భూభాగాన్ని ఆక్రమించడానికి కాకుండా, పొరుగు దేశ సైన్యాన్ని నిర్వీర్యం చేయడానికి, నిర్మూలించడానికి రూపొందించిన ప్రత్యేక సైనిక చర్య అని స్పష్టం చేశారు. రష్యా ఉపయోగించిన పరిభాషను పోప్‌ ఇప్పటికే తిరస్కరించారు. ఇది సైనిక చర్య కాదన్న పోప్‌.. ముమ్మాటికీ ఇదే యుద్ధమే అని ప్రకటించారు. మధ్యధరా ద్వీప దేశానికి రెండు రోజుల పర్యటన సందర్భంగా వచ్చిన పోప్‌. . మాల్టిస్‌ అధికారులను ఉద్దేశిస్తూ ప్రసంగీస్తూ ఐరోపా   తూర్పు నుంచి, సూర్యోదయ భూమి నుంచి.. ఇప్పుడు యుద్ధం కారణంగా చీకటి నీడలు అలుముకుంటున్నాయి అని ఆందోళన వ్యక్తం చేసారు.   ఇతర దేశాలపై దండయాత్రలు అత్యంత క్రూరమైనవిగా చెప్పుకొచ్చారు. అణు…

Read More

భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పే భారతీయ సంస్కృతికి ఉగాది ప్రతీక అని భారత ఉపరాప్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ముచ్చింతల్‌ స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో జరిగిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.  కాలాన్ని గౌరవించడం, ప్రకృతిని పరిరక్షించడమే ఉగాది సందేశమని తెలిపారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ప్రజలు వివిధ పేర్లతో ఈపండగను జరుపుకుంటారని, వేరువేరు భాషలు, వేరువేరు పేర్లు, వేరవేరు సంప్రదాయాల మధ్య ప్రాధాన్యత కలిగిన పండగగా ఉగాది నిలిచిందని చెప్పారు.  ఉగాదితోనే తెలుగు వారికి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందనిచెబుతూ ప్రస్తుతం శ్రీశుభకృత్‌ నామ సంవత్సర ఉగాదిని జరుపుకుంటున్నామని తెలిపారు. శుభకృత్‌ అంటే మేలును కలిగించేదని అర్థమని, ఈపండగ అందరి జీవితాల్లోకి సానుకూల మార్పును తీసుకురావాలని ఆకాంక్షించారు.  వసంత రుతువు ఆగమనానికి ప్రతీక అయిన ఉగాది వేళ వాతావారణంలో స్పష్టమైన మార్పు కనబడుతోందని చెప్పారు. ఉగాది పండగలోని ప్రతి సంప్రదాయం వెనుక వైజ్ఞానిక రహస్యాలు ముడిపడి ఉన్నాయని…

Read More

దేశ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న బాలీవుడ్ అగ్రనటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక సాక్షి ప్రభాకర్ సెయిల్ (37) మృతిచెందడం కలకలం రేపుతున్నది. ఈ కేసులో స్వతంత్ర సాక్షి అయిన ప్రభాకర్ శుక్రవారం మధ్యాహ్నం ముహల్ ప్రాంతంలోని తాను అద్దెకుంటున్న అపార్ట్‌మెంట్‌లో గుండెపోటుతో చనిపోయాడు. ఈ విషయాన్ని ఆయన తరఫు న్యాయవాది తుషార్ ఖండారే వెల్లడించారు. మృతి చెందిన సమయంలో ప్రభాకర్ ఇంట్లోనే ఉన్నాడని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవని పేర్కొన్నారు. ఆయనకు తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రామంలో ఉన్న సోదరులు వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డ్రగ్స్ క్రూయిజ్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ కేసులో మరో సాక్షి అయిన కేపీ గోసావికి ప్రభాకర్ సెక్యూరిటీ గార్డుగా ఉన్నారు. కాగా, ఈ కేసులో అక్టోబర్ లో అరెస్టయిన ఆర్యన్ ఖాన్.. మూడు వారాల తర్వాత…

Read More

ఉక్రెయిన్ పై దాడికి పాల్పడిన రష్యాపై ఆంక్షల విధింపులో కలసి రావాలని ఒక వంక అమెరికా, ఇతర ఐరోపా దేశాలు భారత్ పై వత్తిడి తెస్తున్న సమయంలో భారత్ పర్యటనకు వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కావడం అంతర్జాతీయంగా రాజకీయ దుమారం రేపుతోంది.  యూకె, చైనా, ఆస్ట్రియా, గ్రీస్మె, క్సికో నుండి వచ్చిన మంత్రులతో సహా గత రెండు వారాల్లో భారత్  పర్యటనకు వచ్చిన మంత్రులను ఎవ్వరిని బహిరంగంగా కలవని ప్రధాని, కేవలం రష్యా మంత్రితో కలవడం, సుమారు 40 నిముషాల సేపు వ్యక్తిగతంగా సమాలోచనలు జరపడం ఆసక్తి కలిగిస్తున్నది.   ఉక్రెయిన్ యుద్ధంకు సంబంధించి భారత్ ఎటువైపు మొగ్గు  చూపకుండా, మధ్యస్థంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ, ఆచరణలో రష్యావైపు మొగ్గుచూపు తున్నట్లు స్పష్టం అవుతున్నది.  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నుండి ప్రధాని మోదీకి  వ్యక్తిగతంగా ఒక సందేశాన్ని తెలియజేయాలనుకుంటున్నట్లు లావ్రోవ్ చెప్పడం గమనార్హం.  ‘అధ్యక్షుడు (పుతిన్), ప్రధానమంత్రి నిరంతరం…

Read More

కేంద్రంలోని బీజేపీ వైఖరిని వ్యతిరేకించే కాంగ్రెస్, వామపక్ష, ప్రాంతీయ పార్టీలన్నీ సమైక్యఫ్రంట్‌గా ఏర్పడాలని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పిలుపిచ్చారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత రాజకీయ స్వార్థాలను విడిచిపెట్టి దేశాన్ని రక్షించేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగింపు సందర్భంగా ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  తమిళనాడులో డీఎంకేతో మైత్రి మాదిరిగానే దేశంలోని మిగతా ప్రాంతాల్లో కూడా సూత్రప్రాయమైన మైత్రిని ఏర్పర్చుకోవాలని కాంగ్రెస్‌ పార్టీకి ఆయన విజ్ఞప్తి చేశారు. ‘భారతదేశం భిన్నత్వాన్ని, సమాఖ్య విధానం, లౌకికత, ప్రజాస్వామ్యం, సౌభ్రాతృత్వం, రాష్ట్రాల హక్కులు, విద్యారంగ హక్కులను పరిరక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత రాజకీయ స్వార్థాన్ని పక్కనబెట్టి ఏకం కావాలి. ప్రతి ఒక్కరూ కలిసి వచ్చి దేశాన్ని కాపాడుకోవాలి’అని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ పట్ల తమది వ్యక్తిగత ద్వేషం కాదని చెబుతూ అంశాల ప్రాతిపదికగానే బీజేపీ విధానాలను తాము విమర్శిస్తున్నామని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో…

Read More

పంజాబ్ లో అధికారంలోకి వచ్చిన ఆప్ ప్రభుత్వం మొదటి రోజు నుండి తన ప్రత్యేకత నిరూపించుకోవడం కోసం ఏదో ఒక వివాదాన్ని రేకెక్తినుంచే ప్రయత్నం చేస్తున్నది. తాజాగా, కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంది పంజాబ్, హర్యానాలకు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతున్న చండీఘడ్ పంజాబ్ కే దక్కాలంటూ మరో వివాదం లేవనెత్తింది. పరిపాలనాపరంగా 60:40గా పంజాబ్‌, హర్యానాలు చండీగఢ్‌నును పంచుకుంటున్నాయి. ఈ తరుణంలో చండీగఢ్‌పై సర్వహక్కులు పంజాబ్‌వేనని, అందుకే పూర్తిగా పంజాబ్‌కు బదిలీ చేయాలంటూ రాష్ట్ర అసెంబ్లీలో ఒక తీర్మానం చేశారు. తీర్మానాన్ని ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ప్రతిపాదించగా, ఆర్థిక మంత్రి హర్‌పాల్‌ సింగ్‌ చీమా మద్దతు ప్రకటించారు. తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని చండీగఢ్‌ను తక్షణమే పంజాబ్‌కు బదిలీ చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శుక్రవారం శాసన సభలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. శాంతి, సామరస్యాలను పరిరక్షించేందుకు ఈ నగరాన్ని వెంటనే పంజాబ్‌కు అప్పగించాలని ఈ తీర్మానం…

Read More

`నేను చాలా స్ట్రాంగ్, నా తలను ఎవ్వరు వంచలేరు’ అంటూ ఆహ్వానించినా రాజ్ భవన్ లో జరిగిన ఉగాది ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుతో పాటు అధికార  పక్షం నేతలు ఎవ్వరు హాజరుకాకపోవడంపై గవర్నర్ డా. తమిళశై సౌందరాజన్ తీవ్రంగా స్పందించారు.    ‘‘నేను వివాదాస్పదం చేసే వ్యక్తిని కాదు. గ్యాప్​ సృష్టించే వ్యక్తిని కూడా కాదు” అంటూనే వచ్చే నెల నుంచి రాజ్ భవన్ లో ప్రజా దర్బార్​ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం ద్వారా కేసీఆర్ ప్రభుత్వంకు పరోక్ష హెచ్చరికలు పంపినట్లయింది. ఇది రాజ్‌భవన్‌ కాదు… ప్రజాభవన్‌ అని చెప్పడం ద్వారా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని సంకేతం ఇచ్చారు.  రాష్ట్ర ప్రభుత్వానికి, రాజ్​భవన్​కు గ్యాప్  రావడానికి కారణం తెలియదని చెబుతూ సీఎం కేసీఆర్​సహా రాష్ట్ర మంత్రులకు ఆహ్వానం పంపినప్పటికీ ఎవరూ హాజరుకాలేదు. పోలీస్​, ఇతర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు కూడా పెద్దగా కనిపించలేదని అంటూ ఆమె విస్మయం వ్యక్తం చేశారు. ‘‘ఉగాది వేడుకలు తెలంగాణలో నవశకం. మనం అంతా…

Read More

గురువారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 13 స్థానాలకు గాను బీజేపీ 4 సీట్లు గెలుచుకోవడం ద్వారా బిజెపి మరో రికార్డు సృష్టించింది. ఆ పార్టీ చరిత్రలో మొదటిసారిగా రాజ్యసభలో తన సభ్యుల సంఖ్యను వందకు చేరుకొని, ఇప్పుడు 101 మంది సభ్యులు ఉన్నారు. స్వతంత్ర భారత దేశంలో కాంగ్రెస్ తర్వాత రాజ్యసభలో 100కు మించి సభ్యులున్న పార్టీ బిజెపి మాత్రమే కావడం విశేషం. అదీ గాక, 34 ఏళ్ళ తర్వాత ఒక పార్టీకి రాజ్యసభ సభ్యుల సంఖ్య 100కు దాటింది. చివరిసారిగా కాంగ్రెస్ కు 1988లో రాజ్యసభలో 100కు మించి 108 మంది సభ్యులు ఉండేవారు. ఆ పార్టీకి అప్పటి వరకు పార్లమెంట్ ఉభయ సభలలో మెజారిటీ సభ్యులు ఉండేవారు. అత్యధికంగా, 1962లో 162 మంది సభ్యులు ఉండేవారు.మూడు ఈశాన్య రాష్ట్రాలైన అసోం, త్రిపుర, నాగాలాండ్, హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లను బీజేపీ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే వరకు…

Read More