రాష్ట్ర ప్రభుత్వం రూ.48 వేల కోట్లను దుర్వినియోగం చేసిందని చెప్పిన కాగ్ నివేదికపై సిబిఐతో విచారణ జరిపించాలని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, శాసన మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఈ నిధుల దుర్వినియోగంపై కాగ్ పలుమార్లు ప్రశిుంచినా ప్రభుత్వం నుంచి సమాధానం లేదని వెల్లడించారు. ఈ సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్లిందనేది చెప్పాల్సిన బాధ్యత జగన్ ప్రభుత్వానిదేనని అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, అందులో రూ.48 వేల కోట్లకుపైగా సొమ్ము దుర్వినియోగం అయిందని మాజీ ఆర్ధిక మంత్రి తెలిపారు. దాణా కుంభకోణం రూ.66 కోట్లను బయటపెట్టింది కాగ్ అని, దీనిపై కేంద్రం సిబిఐ విచారణ ఆదేశించిందని యనమల ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రభుత్వం ఇచ్చిన స్పెషల్ బిల్స్ జిఓను సరిదిద్దుకున్నారని, ఇలా ఎందుకు…
Author: Editor's Desk, Tattva News
నాస్తికత్వం పునాదిగా ఏర్పడిన డీఎంకే నేతలు ఎంకే స్టాలిన్ నేతృత్వంలో కొన్నేళ్లుగా దేవాలయాల సందర్భాన ప్రారంభించిన తమిళనాడులో మతంపై అసలు నమ్మకమే లేని సిపిఎం నేతలు ఇప్పుడు దేవాలయ ఉత్సవాలలో పాల్గొనాలని నిర్ణయించారు. రాష్ట్రంలో పెరుగుతున్న సంఘ్ పరివార్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి రాష్ట్రంలోని ఆలయ ఉత్సవాల్లో చురుగ్గా పాల్గొనాలని తమిళనాడు సీపీఎం తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. వచ్చే వారం మదురైలో జరగనున్న పార్టీ రాష్ట్ర సమావేశానికి ముందు విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె బాలకృష్ణన్ గత బుధవారం ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ చర్య పట్ల వామపక్ష వర్గాలలో పలువురు కనుబొమ్మలను ఎగరేస్తున్నారు. పార్టీ మౌలిక సిద్ధాంతాలకే తిలోదకాలివ్వడంగా భావిస్తున్నారు. దేవాలయాలలో సంఘ్ పరివార్ ఆధిపత్యానికి “ఘన ప్రతిఘటన” నిర్మించాలనే లక్ష్యంతో ఈ చర్య తీసుకున్నట్లు కావేరి డెల్టా వ్యవసాయ ప్రాంతం నుండి వచ్చిన నాయకుడైన బాలకృష్ణన్ సమర్ధించుకున్నారు. రాష్ట్ర సీపీఎం రాబోయే 23వ…
నెల రోజులకు పైగా ఒక వంక రష్యా సేనలు పొరుగున ఉన్న ఉక్రెయిన్ లో భీకర పోరాటం చేస్తుండగా, అందులో కీలక పాత్ర పోషింపవలసిన రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు, జనరల్ స్టాఫ్ చీఫ్ జనరల్ వాలెరీ గెరాసిమోవ్ ఎక్కడా కనిపించడం లేదు. యుద్ధ పనులలో తీరిక లేకుండా ఉండడంతో మీడియా ముందుకు రాలేకపోవచ్చని కొందరు ప్రభుత్వ అధికారులు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నా, వారి ఉనికి పట్ల బలమైన అనుమానాలు చెలరేగుతున్నాయి. యుద్ధంలో అనుకున్న విధంగా రష్యా సేనలు పురోగతి సాధింపలేక పోవడం, ప్రధాన నగరాలను స్వాధీనంలోకి తెచ్చుకోలేక పోవడం, భారీ స్థాయిలో సేనలను కోల్పోవలసి వస్తుండడంతో వీరిద్దరూ `శిక్షకు’ గురయ్యారా అనే బలమైన అనుమానాలు ఈ సందర్భంగా వ్యక్తం అవుతున్నాయి. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు గత గురువారం ప్రభుత్వ ఆధీనంలోని టివి ఛానెల్‌లో క్లుప్తంగా కనిపించారు. సుమారు ఒక వారం తర్వాత ఆయన మొదటిసారి బహిరంగంగా కనిపించారు. అయితే టివిలో అట్లా కనిపించి వెళ్ళిపోయినా, ఆయన…
రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించే విషయంలో కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో జరిగిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఈ అంశాన్ని నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ చెంతకు తీసుకువెళ్లాలన్న యోచనలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఉన్నట్టు తెలుస్తోంది. ఉగాది తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో ప్రధానిని కలిసేందుకు ఆయన అపాయింట్‌మెంట్ కోరాలని కేసీఆర్ రాష్ట్రానికి చెందిన ఎంపీలను కోరినట్టు సమాచారం. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని ముడి బియ్యాన్ని మాత్రమే తీసుకుంటామని పీయూష్ గోయల్ తెగేసి చెప్పడంతో ఇక ఈ అంశాన్ని ప్రధాని వద్దే తేల్చుకోవాలన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్టు తెరాస వర్గాలు చెబుతున్నాయి. పంజాబ్ నుంచి ఏటా గోధుమలు, ధాన్యాన్ని సేకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో ముడి బియ్యమే కావాలని పట్టుబట్టడం బట్టి చూస్తుంటే రాష్ట్ర రైతాంగాన్ని ఇబ్బంది పెట్టేందుకే ఏదో మెలిక పెట్టి తద్వారా ధాన్యాన్ని సేకరించకుండా ఎగ్గొట్టే ప్రయత్నం…
కొద్దికాలంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుతో క్షీణిస్తున్న సంబంధాలను మెరుగు పరచుకొనేందుకు గవర్నర్ డా. తమిళిసై సౌందరాజన్ చొరవ తీసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ బిజెపిపై, ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై నిప్పులు చేరగడం ప్రారంభించినప్పటి నుండి రాజ్ భవన్ కు దూరంగా ఉంటున్నారు. గవర్నర్ సహితం ఎంతసేపు మోదీ పాలనను పొగడ్తలతో ముంచెత్తడమే గాని రాష్ట్ర పాలన గురించి ఎక్కడా ఒక మంచి మాట కూడా చెప్పక పోవడం టి ఆర్ ఎస్ శ్రేణులకు ఆగ్రహం కలిగిస్తున్నది. ‘సాక్షి’, ‘సాక్షి టీవీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాష్ట్ర ప్రభుత్వం, రాజ్‌భవన్ మధ్య ఇటీవల నెలకొన్న విభేదాలు, ఇతర అంశాలపై స్పందిస్తూ తమిళిసై పలు వాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉపఎన్నికలు దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ నుండి వచ్చి చేరిన కౌశిక్ రెడ్డిని శాసన మండలికి గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం పంపిన ఫైల్ ను ఆ నిబంధనల పరిధిలోకి అతని రాదనీ అంటూ గవర్నర్ ఆమోదించక పోవడంతో కేసీఆర్ కు, ఆమెకు…
విదేశాలకు వెళ్లే భారతీయులకు త్వరలోనే కరోనా టీకా బూస్టర్ డోస్ అందనుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధివిధానాలతో నిర్ణయం వెలువరించనుంది. విద్యాభ్యాసం, ఉద్యోగాలు, క్రీడలలో పాల్గొనడం, విదేశీ సెమినార్లకు వెళ్లేవారికి ఈ బూస్టర్ డోస్‌లు కొవిడ్ నియంత్రణ దిశలో ఎంతగానో ఉపయోగపడుతాయి. ఇప్పటివరకు రెండు డోసుల టీకా కార్యక్రమం ముగించుకుని విదేశీప్రయాణాలకు వెళ్లే వారు అక్కడ బూస్టర్ డోస్ వేయించుకోవడానికి పలు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఈ శ్రేణుల వారికి బూస్టర్ డోస్‌ను అందించేందుకు ముందుకు వచ్చింది. అనేక మంది భారతీయులు వ్యాపార లావాదేవీలు, అధికారిక కార్యక్రమాలలో పాల్గొనేందుకు కూడా విదేశాలకు వెళ్లుతున్నారు. వీరందరికి కూడా ఈ బూస్టర్ డోస్ సౌకర్యం ఏర్పడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఈ బూస్టర్ డోస్ పొందాలనుకునే వారు ప్రైవేటు క్లినిక్‌లలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. దేశంలో ఇప్పుడు ఆరోగ్య పరిరక్షణ, పారిశుద్ధం పనులలో ఉన్న వారు, 60 ఏండ్లు…
ఇంధన ధరల పెంపునకు వ్యతిరేకంగా ఈ నెల 31న నిరసన తెలపాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ‘దేశంలో పెరుగుతున్న గ్యాస్, పెట్రో, డీజిల్ అపరిమిత పెరుగుదలకు వ్యతిరేకంగా చెవిటి బిజెపి సర్కార్‌ను అప్రమత్తం చేసేందుకు ఈ నెల 31న ఉదయం 11 గంటలకు ప్రజలు తమ ఇళ్ల వెలుపల లేదా బహిరంగ ప్రదేశాల్లో గ్యాస్ సిలిండర్లు, డ్రమ్స్, గంటలతో పాటు ఇతర వాయిద్యాలతో నిరసన తెలపాలి’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా పిలుపునిచ్చారు. సుమారు మూడు గంటలపాటు శనివారం జరిగిన అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ ఇన్‌ఛార్జిలు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత.. దేశంలో చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత ఐదు రోజుల్లో నాలుగు సార్లు 80 పైసలు చొప్పున పెరిగింది. గ్యాస్ ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ ఈ నిరసనకు పిలుపునిచ్చింది. మూడు దశల వారీగా ఆందోళనకు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. మార్చి…
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ గురువారం ఆకస్మికంగా భారతదేశ పర్యటనకు వచ్చారు. రెండేళ్ల విరామం తరువాత చైనా ఉన్నత స్థాయి ప్రభుత్వ ప్రతినిధి ఒకరు భారతదేశానికి వచ్చారు. లద్థాఖ్ సరిహద్దులలో ప్రతిష్టంభన ఇప్పటికీ కొనసాగుతోన్న దశలో చైనా విదేశాంగ మంత్రి ఇక్కడికి చేరుకున్నారు. శుక్రవారం వాంగ్ యీ విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌తో సమావేశమాయ్యారు. ఇరు దేశాల నేతల మధ్య ముఖాముఖి చర్చల ఆరంభానికి చైనా విదేశాంగ మంత్రి ఆగమనం సంకేతంగా మారింది. ఈ ఏడాది చివరిలో చైనా ఆతిథ్యంలో బీజింగ్‌లో జరిగే బ్రిక్స్ సదస్సుకు భారత ప్రధాని మోదీని ఈ పర్యటన సందర్భంగా వాంగ్ ఆహ్వానించారు. చైనా నేత భారత పర్యటనపై తుది క్షణం వరకూ సస్పెన్స్ నెలకొంది. చైనా విదేశాంగ మంత్రి భారత రాజధాని ఢిల్లీకి ప్రత్యేక విమానంలో చేరుకున్న తరువాత కూడా ఆయన పర్యటన గురించి కానీ, కనీసం ఆయన…
తనను జైల్లో పెట్టాలనేదే బీజేపీ లక్ష్యమైతే పెట్టండంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే రాష్ట్ర శాసనసభలో సవాలు విసిరారు. అధికారంలోకి రావాలనుకుంటే రావాలని, అంతే కానీ దుర్మార్గాలకు పాల్పడొద్దని అంటూ సుదీర్ఘకాలం తమ పార్టీ మిత్రపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీకి ఆయన హితవు చెప్పారు. తాజాగా ఉద్ధవ్ బావమరిదిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసి రూ 6.45 కోట్ల ఆస్తులను జప్తు చేసిన రెండు రోజులకు ఆయన ఈ సంఘటనపై ఘాటుగా స్పందించారు. ‘‘ఇదంతా (ఈడీ దాడులు) అధికారం కోసమేగా అధికారంలోకి రావాలనుకుంటే రండి. కానీ ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడొద్దని హెచ్చరిస్తున్నాను. మేము మీ (బీజేపీ) కుటుంబ సభ్యులను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. అలా అని మీ కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఎలాంటి తప్పులూ చేయలేదని కాదు. కానీ, ఎవరి కుటుంబ సభ్యులపైనా వేధింపులకు దిగొద్దు’’ అని ఉద్ధవ్ భావోద్వేగంగా ప్రసంగించారు. అంతకు ముందు మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మంత్రి నవాబ్ మాలిక్ రాజీనామాను బీజేపీ డిమాండ్ చేస్తున్న…
మహిళా సాధికారత, ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించే విధంగా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆశయాల మేరకు మహిళా శక్తిని మరింత ముందుకు తీసుకెళ్లేలా కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతున్నట్లు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అందులో భాగంగా ప్రతి జిల్లాలో మహిళలకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తామని, క్షేత్రస్థాయిలో నిస్వార్థంగా పనిచేసే వీరమహిళలకు కమిటీల్లో పెద్దపీట వేస్తామని చెప్పారు. వీరమహిళ విభాగం ప్రాంతీయ కమిటీలతో శుక్రవారం ఉదయం మనోహర్ -టె-లీకాన్ఫరెన్స్ నిర్వహిస్తూ “గ్రామీణ భారతదేశంలో ఇప్పటికీ 70 నుంచి 80 శాతం మంది మహిళలు వ్యవసాయాన్నే నమ్ముకొని జీవిస్తున్నారు. శ్రమను ఎక్కువగా ధారపోసేది వ్యవసాయం, వ్యవసాయాధారిత పనుల్లోనే. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా, కష్టాలకోర్చి, కన్నీటిని దిగమింగి కన్నబిడ్డల చదువుల కోసం ఆరుగాలం కష్టపడుతుంటారు. పొదుపు సంఘాల ద్వారా రుణాలు తీసుకొని వాటిని ఠంచనుగా చెల్లించడంలోనూ మన రాష్ట్ర మహిళలదే రికార్డు.” అని నాదెండ్ల వ్యాఖ్యానించారు. మహిళాభ్యున్నతికి జనసేన పార్టీ…