న్యాయవ్యవస్థలో స్వీయ నియంత్రణ ఉండాలని మాజీ రెవిన్యూ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు హితవు చెప్పారు. ఇతర వ్యవస్థల్లో అందునా శాసన వ్యవస్థలో జోక్యం చేసుకోవడం ఎంతవరకు అంటూ ఇటీవల మూడు రాజధానుల చట్టాన్ని రాష్ట్ర హైకోర్టు కొట్టివేయడాన్ని ప్రశ్నించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గురువారం మధ్యాహ్నాం జరిగిన పరిపాలన వికేంద్రీకరణ.. మూడు రాజధానులపై స్వల్పకాలిక చర్చలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు. లో పాల్గొంటూ ఏపీ అసెంబ్లీకి కొన్ని పరిమితులు పెడుతూ హైకోర్టు వ్యాఖ్యలు చేసిందని గుర్తు చేశారు. మూడు రాజధానులపై అసెంబ్లీ చట్టం చేయొద్దంటూ హైకోర్టు తెలిపిందని విస్మయం వ్యక్తం చేశారు. “తీర్పు తర్వాత న్యాయ నిపుణులతో చర్చించాను. ఆపైనే సభానాయకుడికి ఓ లేఖ రాశాను. దీనిపై సభలో చర్చించాల్సిన అవకశ్యత ఉందని భావిస్తున్నా. చర్చించే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, స్పీకర్ సీతారాంలకు ధన్యవాదాలు” అని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థల ప్రాధాన్యతను తగ్గించాలన్న అభిప్రాయం తనకు ఏమాత్రం లేదని స్పష్టం చేస్తూ, బాధ్యతల్ని కట్టడి చేసే విధంగా ఉన్నాయన్న అభిప్రాయం…
Author: Editor's Desk, Tattva News
మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన ఆరోపణలపై జమ్మూ కాశ్మీర్ ప్రభుతం సీబీఐ విచారణకు ఆదేశించింది. రెండు ఫైల్స్ క్లియర్ చేస్తే తనకు రూ.300 కోట్ల లంచం ఇవడానికి రెడీ అయ్యారని సత్యపాల్ మాలిక్ కొన్ని రోజుల క్రితం వ్యాఖ్యానించారు. ఆ ఫైల్స్‌లో ఒక ఫైల్ ఓ పారిశ్రామికవేత్తది కాగా, మరో ఫైల్ ఓ ఆర్‌ఎస్‌ఎస్ నేతదిగా ఆయన వెల్లడించారు. సత్యపాల్ మాలిక్ జమ్మూ గవర్నర్‌గా ఉన్న సమయంలో ఆరోపణలు చేశారు. ఈ ప్రతిపాదనను తాను తిరస్కరించానని తెలిపారు. ఈ ఆరోపణలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ విషయంపై విచారణ జరపాలని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం సీబీఐకి సిఫార్సు చేసింది. ఈ విషయంపై పూర్తి విచారణ జరపాలని.. నిష్పక్షపాతంగా ఉండాలని జమ్మూ ప్రభుత్వం సీబీఐని కోరింది. రాజస్థాన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో జమ్మూ కాశ్మీర్ గవర్నర్ హోదాలో సత్యపాల్ మాలిక్ పాల్గొన్నారు. ఆ సమయంలో రూ.300 కోట్ల లంచం వ్యవహారం ప్రకటించారు.…
బర్లు, గొర్లు కాచుకుంటూ జీవనం సాగిస్తున్న గిరిజనులు, గొఱె కాపరుల భూముల జోలికొస్తే ఊరుకోమని వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అవసరం అయితే నిరాహార దీక్ష కూడా చేస్తానని స్పష్టం చేశారు. ప్రజాప్రస్థానంలో భాగంగా షర్మిల 35వ రోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆత్మకూరు మండలం పారుపల్లి గ్రామంలో పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రబోళ్ల భూముల అన్యాక్రాంతంపై స్పందిస్తూ గ్రామంలోని సర్వే నెంబర్ 279లో సుమారుగా 127 ఎకరాల భూమి ఉందని, ఎన్నో ఏండ్లుగా ఆ భూముల్లో గిరిజనులు, గొర్రెకురుమలు బర్లు, గొర్లు కాచుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఆ భూములను టీఆర్ఎస్ ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా మైనింగ్ కు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. గతంలో వైయస్ఆర్ ఆ భూములు కబ్జాకు గురికాకుండా, అటవీశాఖ స్వాధీనం చేసుకోకుండా కాపాడి, పేదల కోసం కేటాయించారని ఆమె గుర్తు చేశారు. ప్రస్తుతం కేసీఆర్ ఆ భూముల్ని…
చట్టసభల్లోకి బీసీలను తీసుకొచ్చేందుకే బీఎస్పీ కృషి చేస్తదని చెబుతూ వచ్చే ఎన్నికల్లో బీసీలకు 70 సీట్లిస్తామని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. ఆయన మొదలుపెట్టిన ‘బహుజన రాజ్యాధికార యాత్ర’ 19వ రోజు నార్కట్‌పల్లి మండలంలో అక్కినపల్లి గ్రామంకు చేరిన సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ బహుజన రాజ్యాధికారం కోసం పేద ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని తెలిపారు. ‘బహుజన రాజ్యాధికారం కోసం పేద ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. బంగారు తెలంగాణ కాదు.. బాధల తెలంగాణగా మార్చారు. మంత్రుల జీతాలు ప్రతి నెల ఒకటవ తారిఖున వస్తున్నాయి.. కానీ పింఛన్ ఈ రోజు 24 తారీఖు వరకు కూడా ఇవ్వలేదు’ అంటూ పేర్కొన్నారు. యాసంగి వడ్ల కొనుగోలు బంద్ చేశారని చెబుతూ ఎన్నికల కోసం కేసీఆర్ వడ్ల డ్రామా ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టులు నిర్మించి వడ్లు కొనుగోలు చెయ్యకపోతే లాభం ఏంటి? అని ప్రశ్నించారు. డిస్కంలకు తెలంగాణ రాష్టం రూ…
పశ్చిమ బెంగాల్ బీర్భూమ్ లో జరిగిన ఘటనలో ఎనిమిది మంది సజీవ దహనంకు గురికావడం దేశ వ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఆ రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితులకు దర్పణం పడుతుందని అంటూ పలువురు పేర్కొన్నారు. ఈ విషయమై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బనెర్జీ సంఘటన పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సామూహిక హత్యలకు పాల్పడిన నేరస్థులను, అలాంటి నేర శక్తులను ప్రోత్సహిస్తున్న వారిని ఎప్పటికీ క్షమించరాదని బెంగాల్ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. నేరస్థులను సాధ్యమైనంత త్వరలో పట్టుకుని శిక్షించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వానికి అన్నివిధాలా సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. స్వాతంత్య్ర పోరాట ఉద్యమంలో పాల్గొన్న అమరులకు నివాళిగా బుధవారం కలకత్తాలో ఏర్పాటు చేసిన ”బిప్లోబి భారత్ గ్యాలరీ”ని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంబభిస్తూ ఇలాంటి హేయమైన నేరానికి పాల్పడిన వారిని మమతా బెనర్జీ సారథ్యంలోని బెంగాల్ ప్రభుత్వం చట్టానికి పట్టి ఇస్తుందనే…
మహారాష్ట్రలో వరుసగా అధికారంలో ఉన్న పార్టీల నేతలు లక్ష్యంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) జరుపుతున్న దాడులు రాజకీయ కలకలం సృష్టిస్తున్నాయి. బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసినా 24 గంటలలో కూలిపోవడం, వెంటనే సుదీర్ఘకాలం బిజెపి మిత్రపక్షంగా ఉన్న శివసేన ఎన్సీపీ, కాంగ్రెస్ లతో కలసి కూటమి ఏర్పాటు చేసి అధికారమలోకి రావడాన్ని బిజెపి నాయకులు తమాయించుకోలేక పోతున్నట్లు కనిపిస్తున్నది. అంతర్గత కలహాలతో ఆ ప్రభుత్వం సత్వరం కూలిపోతుందని అనుకున్న బిజెపి నాయకులకు రెండేళ్లు దాటినా సుస్థిరంగా కొనసాగుతూ ఉండడంతో అసహనానికి గురవుతున్నారు. ఈ ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. ప్రభుత్వం పడగొట్టడంతో కలసి రమ్మనమని బిజెపి నాయకులు తనను కోరారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొనడం గమనార్హం. పైగా కూటమి నుండి బైటకు వస్తే ఉద్ధవ్ థాకరే ను ముఖ్యమంత్రిగా తాము మద్దతు ఇస్తామని…
కరోనా మహమ్మారి విజృంభించిన దరిమిలా పాఠశాలల్లో నిలిపివేసిన మధాహ్న భోజన పథకాన్ని తిరిగి ప్రారంభించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లోక్‌సభ జీరో అవర్‌లో సోనియా గాంధీ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ మూడేళ్ల లోపు పిల్లలతోపాటు గర్భిణి మహిళలకు, బిడ్డలకు పాలిచ్చే తల్లులకు వేడిగా ఆహారాన్ని అందచేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కరోనా వైరస్ కారణంగా అన్నిటి కన్నా ముందుగా పాఠశాలలు మూతపడ్డాయని, అన్నిటి కన్నా ఆలస్యంగా తెరుచుకున్నవి కూడా పాఠశాలలేనని ఆమె తెలిపారు. భావి భారత పౌరులు కరోనా కాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆమె గుర్తు చేశారు. పాఠశాలలు మూతపడిన వెంటనే మధ్యాహ్న భోజన పథకం కూడా నిలిచిపోయిందని, జాతీయ ఆహార భద్రతా చట్టం, సుప్రీంకోర్టు ఆదేశాల కారణంగానే ప్రజలకు ఉచితంగా రేషన్ లభించిందని సోనియా తెలిపారు. అయితే పిల్లలకు ఉడికించిన, పౌష్ఠికాహారానికి రేషన్ ప్రత్యామ్నాయం కాదని ఆమె స్పష్టం చేశారు. ఇప్పుడు మళ్లీ పాఠశాలలు…
అవినీతి అక్రమాలకు పాల్పడే అధికారులకు వ్యతిరేకంగా వీడియోలను ప్రజలు అప్‌లోడ్ చేసేందుకు అవినీతి నిరోధక హెల్ప్‌లైన్ నంబర్‌ను పంజాబ్ నూతన ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ బుధవారం ప్రారంభించారు. స్వాతంత్య్ర వీరులు భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ అమరులైన రోజున అవినీతి నిరోధక యాక్షన్ లైన్ పేరిట దీన్ని ప్రారంభించారు. ప్రజలు నేరుగా 9501200200 నంబర్‌కు డయల్ చేసి అవినీతి అధికారులపై ఫిర్యాదు చేయవచ్చు. ఈనెల 16న ఖట్కర్ కలాన్‌లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన మాన్ నెలరోజుల్లో అవినీతిని అంతం చేయడానికి ప్రజల సహకారాన్ని అర్థించారు. మార్చి 23న హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభిస్తానని ప్రజలకు వాగ్దానం చేశానని, ఆ ప్రకారమే మాట నిలబెట్టుకున్నానని ఒక వీడియోలో మాన్ తెలియచేశారు. లంచం అడిగే అధికారులకు సంబంధించిన వీడియోలను ఈ నంబర్‌కు పంపాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ ఫిర్యాదులను సిబ్బంది దర్యాప్తు చేసి దోషి అని తేలితే అధికారి అయినా, మంత్రి…
కర్ణాటకలోని స్థానిక వార్షిక ఉత్సవాల సమయంలో ముస్లింలు దుకాణాలను ఏర్పాటు చేయకుండా ఆలయ అధికారులు నిషేధం విధించారు. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఈ నెల 15న కర్ణాటక హైకోర్టు సమర్థించిన సంగతి విదితమే. కాగా, ఈ తీర్పును సవాలు చేస్తూ బంద్‌కు పిలుపునిచ్చిన ముస్లిం వ్యాపారవేత్తలు తమ దుకాణాలకు తాళాలు వేశారు. దానిపై ఆగ్రహం చెందిన పలు దేవాలయాల పాలకవర్గాలు ఇప్పుడు ఉత్సవాల్లో దుకాణాల ఏర్పాటుపై నిషేధం విధించాయి. ఈ ఉత్సవాల సమయంలోనే కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుండగా ముస్లిం వ్యాపారులపై వేటు వేయడంతో, వారికి తీవ్ర నష్టం చేకూరనుంది. కాగా, దీనిపై వివరణ కోరుతూ పోలీసులను నివేదికలివ్వాలని రాష్ట్ర హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్రఆదేశించారు. అదేవిధంగా రాష్ట్రంలో శాంతి, భద్రతల పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా పరిశీలించనున్నట్లు తెలిపారు. ‘దేవాలయాల వద్ద ముస్లిం వ్యాపారస్తులు… స్టాళ్లను ఏర్పాటు చేసుకోనివ్వకుండా.. పలు హిందూత్వ సంస్థలు అడ్డుకున్నాయని మీడియాలో కథనాలు రావడం చూశానని చెప్పారు. ఈ…
సబ్ కా సాత్.. సబ్ కా వికాష్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీ కా సాత్…దేశ్ కా వినాష్‌గా మారిపోయిందని తెలంగాణ ఆప్ సర్చ్ కమిటీ చైర్‌పర్సన్ ఇందిరా శోభన్ ఆరోపించారు. పెంచిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను నిరసిస్తూ హైదరాబాద్‌లో ఆమె ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ట్యాంక్‌బండ్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఖాళీ సిలెండర్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఇందిరా శోభన్ మాట్లాడుతూ ప్రధానిగా మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిత్యావసర సరుకులు మొదలుకొని పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు అత్యంత వేగంతో పెరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ముఖ్యంగా గ్యాస్ సిలెండర్ ధర వెయ్యి రూపాయలు దాటడంతో మహిళలు వంట వండలేక తిరిగి కట్టెల పొయ్యిని ఆశ్రయించే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ కంపెనీలకు ఆదాయం సమకూర్చే పనిలో ప్రధాని మోదీ పడ్డారని, వారు ఎలా చెబితే అలా వింటూ ధరల పెరుగుదలకు…