Author: Editor's Desk, Tattva News

కఠినమైన ఆర్ధిక ఆంక్షలను అమెరికా, ఐరోపా దేశాలు విధించడంతో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడం కోసం ఎటువంటి సంక్షోభం ఎదురైనా తట్టుకోవడానికి వెళ్ళగా రష్యా భారీ స్థాయిలో సేకరించుకున్న విదేశీ మారక ద్రవ్యం, బంగారం ఇప్పుడు అక్కరకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఆ నిధులను విదేశీ బ్యాంకులలో దాచుకోవడంతో వత్తిపైన కూడా ఆంక్షలు విధించారు. దానితో అవి నిరుపయోగంగా మిగిలాయి. 2014లో క్రిమియాను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఈ నిల్వలను విపరీతంగా పెంచుకుంది. ఆంక్షల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు రష్యాకు ఉపయోగపడి ఉండేవి. రష్యన్ కరెన్సీ రూబుల్ విలువ పతనం కాకుండా కాపాడటానికి ఆ దేశ సెంట్రల్ బ్యాంకుకు అవకాశం లభించి ఉండేది. క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకున్న తర్వాత రష్యన్ కరెన్సీ రూబుల్ విలువ అమెరికన్ డాలర్‌తో పోల్చినపుడు సగానికి పతనమైంది. దీంతో రష్యన్ సెంట్రల్ బ్యాంకు రూబుల్‌ను స్థిరపరచడానికి 130 బిలియన్ డాలర్లు ఖర్చు చేయవలసి వచ్చింది. ఏడేళ్ళ క్రితం 368 బిలియన్…

Read More

మహిళలను అవమానించి సీఎం కేసీఆర్ పైశాచిక ఆనందం పొందుతున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఆరోపించారు. ఈసారి తన శాడిస్ట్ మనస్తత్వానికి ఏకంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై గారిని లక్ష్యంగా చేసుకున్నారని అంటూ ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.  ఆమె లేకుండా బడ్జెట్ సమావేశాలు జరపాలనుకోవడమే కాకుండా,   గత నెలలో జరిగిన రిపబ్లిక్ దినోత్సవం రోజున కూడా సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు రాజ్‌భవన్ కార్యక్రమానికి హాజరు కాకుండా గవర్నర్ గారిని అవమానించారని ఆమె గుర్తు చేశారు.  మేడారంలో సమ్మక్క, సారలమ్మ ఆడబిడ్డ దేవతల జాతరలో కూడా మహిళా గవర్నర్ అయిన తమిళిశై గారిని ప్రోటోకాల్ ఉల్లంఘనతో అవమానించారని ఆమె ధ్వజమెత్తారు. గవర్నర్‌కు స్వాగతం పలికేందుకు… వీడ్కోలు చెప్పేందుకు ములుగు జిల్లా కలెక్టర్‌, ఎస్పీ రాలేదు. మేడారంలో గవర్నర్‌ ఉన్నంత సేపు మంత్రులు, అధికారులు కనిపించలేదని ఆమె గుర్తు చేశారు.   ముఖ్యంగా గిరిజన ప్రాంత అభివృద్దిపై గవర్నర్‌కు ప్రత్యేక…

Read More

రష్యా – ఉక్రెయిన్ యుద్ధం గురించి పలు అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. ప్రపంచంపై ఆధిపత్యం కోసం కుట్రలు, కుతంత్రాలు, వ్యూహాలు రచిస్తూ, అమలు చేస్తున్న అమెరికాను ఈ సందర్భంగా పలువురు నిందిస్తున్నారు. సోవియట్ యూనియన్ పఠనంతరం కూడా రష్యాను చావు దెబ్బ కొట్టాలన్న దుర్నీతిని అమెరికా అమలు చేస్తున్నదని ఆరోపిస్తున్నారు.  నాటో అస్తిత్వమే ఈ యుద్దానికి కారణం అని అందరూ అంగీకరిస్తున్నారు. ప్రత్యర్థి వార్సా కూటమి కనుమరుగై పోయినా, అమెరికా నేతృత్వంలో నాటో సైనిక కూటమి విస్తరణలో భాగంగా ఉక్రెయిన్ ను సభ్యదేశంగా అక్కున చేర్చుకోవడానికి వేసిన ఎత్తుగడలను ఎండగడుతున్నారు. ఉక్రెయిన్ నాటోలో చేరితే తమ రక్షణ ప్రమాదంలో పడుతుందనే రష్యా ఆవేదన పట్ల సానుభూతి చూపుతున్నారు. అయితే ఈ సందర్భంగా ఒక ప్రధాన మౌలిక సమస్యను ప్రముఖ వామపక్ష మేధావి టి లక్ష్మీనారాయణ లేవనెత్తారు. రాజకీయ ప్రత్యర్థులను అణగతొక్కేస్తూ నియంతృత్వ పోకడలతో పాలన సాగిస్తున్న పుతిన్ రష్యన్ జాత్యంహకారాన్ని రెచ్చగొట్టి రాజ్యాధికారాన్ని పదిలం చేసుకోవాలని…

Read More

రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్మించాల్సిందేనని స్పష్టం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్ట్‌ సంచలన తీర్పునిచ్చింది. గత ప్రభుత్వం చేసిన సిఆర్‌డిఎ చట్టం ప్రకారం పనిచేయాల్సిందేనని తేల్చి చెప్పింది. దానితో మూడు రాజధానుల పేరుతో అమరావతి నుండి కీలక ప్రభుత్వ యంత్రాంగాన్ని తరలించే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రయత్నాలకు పెద్ద అవరోధం పడినట్లయింది.  పైగా, అమరావతి భూములను రాజధానికి తప్ప వేరే అవసరాలకు వినియోగించుకోవద్దని కూడా స్పష్టం చేసింది. ఉన్నది ఉన్నట్లుగా మాస్టర్‌ప్లాన్‌ అమలు చేయాల్సిందేనని పేర్కొంది. అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు కోర్టుకు తెలియజేయాలని తెలిపింది. రైతులకు అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లను మూడు నెలల్లోగా అందజేయాలని  ఆదేశించింది. ఆరు నెలల్లో ఒప్పందం ప్రకారమే రాజధానిగా అమరావతిని అభివృద్ది చేయాలని తీర్పునిచ్చింది. కొంతమంది న్యాయమూర్తులు ఈ కేసులు విచారించొద్దన్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని హైకోర్టు…

Read More

(ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ ఇంటర్వ్యూ రెండో భాగం)ప్రశ్న: బిజెపిని వ్యతిరేకించే అన్ని పార్టీలను దేశ వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారు. అమిత్ షా: మేం ఎవరినీ దేశ వ్యతిరేకులు అని అనలేదు. మేం ఏ పార్టీని దేశ వ్యతిరేకి అని అనలేదు. కానీ ఏ పార్టీ అయినా దేశ వ్యతిరేకులకు మద్దతిస్తే వాటిని బయటపెడతాం. అది మన బాధ్యత. ప్రశ్న: అయితే ఇప్పుడు మీరు ఓ పార్టీ గుర్తును ఉగ్రవాదంతో ముడిపెట్టారు? అమిత్ షా: ఉగ్రవాద నిరోధక చట్టాల కింద అభియోగాలు మోపిన వారిని ఆయన (అఖిలేష్ ప్రభుత్వం) విడుదల చేసిందని, అలహాబాద్ హైకోర్టు జోక్యం చేసుకుందన్న వాస్తవాన్ని మీరు ఎలా కాదనగలరు? నన్ను వదిలేయండి. నేను అతని ప్రతిపక్షంలో ఉన్నాను, మీరు ఏమి చెబుతారు? ఏ ప్రభుత్వమైనా ఉగ్రవాదులపై కేసులను ఉపసంహరించుకుంటే దానిని దేశ వ్యతిరేకం అంటాం. ప్రశ్న: మీరు యుపిలో విజయం సాధిస్తారని నమ్మకంగా ఉన్నారు. కాబట్టి రెండవ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం  ప్రాధాన్యత…

Read More

పశ్చిమ బెంగాల్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 108 మునిసిపాలిటీలకు జరిగిన ఎన్నికలలో  102 మునిసిపాలిటీలను  గెలుచుకున్న అధికార తృణమూల్ కాంగ్రెస్  భారీ విజయాన్ని నమోదు చేసింది. 2021 అసెంబ్లీ ఎన్నికలు, తదుపరి అసెంబ్లీ ఉపఎన్నికలు, కోల్‌కతా మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత, మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీ స్థానిక సంస్థలలో  మెజారిటీ మున్సిపాలిటీలను గెలుచుకోవడం ద్వారా తన పట్టును బలోపేతం చేసుకుంది.  టీఎంసీ గెలిచిన 102 పురపాలక సంఘాలలో  31 మున్సిపాలిటీల్లో ప్రతిపక్షం లేదు.నదియా జిల్లాలోని తాహెర్‌పూర్ మున్సిపాలిటీలో లెఫ్ట్ ఫ్రంట్ విజయం సాధించింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 77 సీట్లు గెలుచుకుని పశ్చిమ బెంగాల్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) తన ఖాతా తెరవలేకపోయింది.  కాంగ్రెస్ కూడా ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఆశ్చర్యకరంగా, కొత్తగా ఏర్పడిన హమ్రో పార్టీ డార్జిలింగ్ మునిసిపాలిటీని గెలుచుకుంది. టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ తన పార్టీకి…

Read More

ఆధ్యాత్మికత ఆయుధంగానే విశ్వశాంతికి, సర్వమానవ సౌభ్రాతత్వానికి భారతదేశం బాటలు వేయనుందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వేదకాలం నుంచి ప్రపంచానికి భారతదేశం అందిస్తున్న ఆధ్యాత్మిక వారసత్వాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఆయన సూచించారు.  విజయవాడలో శ్రీ జగన్నాథ స్వామి తత్వాలను వివరిస్తూ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కుమారుడైన ప్రసేన్ జిత్ హరిచందన్ నేతృత్వంలోని ‘డివైన్ క్యాప్సూల్’ సంస్థ తీసుకొచ్చిన ‘జగన్నాథాష్టకం’ సీడీని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. జగద్గురు ఆదిశంకరాచార్యులు పూరీ సందర్శన సందర్భంగా విష్ణు రూపమైన జగన్నాథుడి లీలా వినోదాన్ని కీర్తిస్తూ ఈ జగన్నాథాష్టకం పఠించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.  భారతదేశం అపారమైన ఆధ్యాత్మిక సంపదకు నిలయమని, అలాంటి ఆధ్యాత్మిక భావాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకుని మానసిక ప్రశాంతతను పొందాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కరోనా సమయంలో ఇళ్లలోనుంచి బయటకు రాలేని సందర్భంలో చాలా మంది శారీరక ఆరోగ్యం కోసం యోగ, మానసిక ఆరోగ్యానికి ధ్యానం, ఆధ్యాత్మికత…

Read More

వివేకా నందరెడ్డి హత్య కేసు విచారణలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి జోక్యం లేదని మాజీ డిజిపి గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టం చేశారు. ఆ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని, నిజాల్ని బయటకు తీసి దోషులకు శిక్షపడేలా చూడాలని సిఎం తనకు ఎప్పుడూ చెప్పేవారని ఆయన తెలిపారు. వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి డిజిపిగా ఉన్న సమయంలో తాను మాట్లాడానంటూ కొన్ని వ్యాఖ్యలు పత్రికల్లో వచ్చాయని, అందులో వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తనపై ఉందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డి, అవినాశ్‌రెడ్డిల కుటుంబాలు తనకు రెండు కళ్లులాంటివని మాత్రమే సిఎం తనకు చెప్పారని అందులో వివరించారు. సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి 2019 సెప్టెంబరులో తనను కలిసినప్పుడు ఇదే విషయాన్ని చెప్పానని తెలిపారు. అదే సమయంలో అమాయకులు ఇబ్బంది పడకుండా చూడాలని ఆయన తనతో చెప్పారని కూడా వారికి తెలియజేశానని పేర్కొన్నారు. తదనంతరం ఈ కేసుకు సంబంధించి అన్ని రికార్డులు, వాస్తవాలను…

Read More

బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను అంతర్జాతీయ మాదక ద్రవ్యాల కుట్రతో అనుసంధానించడానికి ఎటువంటి ఆధారాలు లేవని, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తులో కనుగొన్నట్లు తెలుస్తున్నది. అలాగే, ఖాన్ అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్‌లో భాగమని నిరూపించడానికి కూడా ఎటువంటి ఆధారాలు లేవని ఆ వర్గాలు తెలిపాయి. గోవాకు వెళ్లే కోర్డెలియా యాచట్‌పై జరిపిన దాడిలో కొన్ని అక్రమాలు జరిగాయని మాత్రమే అధికార వర్గాలు చెప్పగలుగుతున్నాయి. ఆ అంశాన్ని సిట్ ఇంకా పరిశీలిస్తోంది. అప్పటి ముంబై జోన్ హెడ్ సమీర్ వాంఖడే నేతృత్వంలోని ఎన్‌సిబి బృందం కార్డెలియా క్రూయిజ్ యాచ్‌పై అక్కడ అక్టోబర్ 2 , 3 మధ్య రాత్రి మాదకద్రవ్యాల పార్టీ జరుగుతుండగా దాడి చేయడం తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్యన్ ఖాన్ ,మరికొందరిని మాదక ద్రవ్యాల కుట్ర, డ్రగ్స్ సేవించిన ఆరోపణలపై బృందం అదుపులోకి తీసుకుంది. ఖాన్‌ను ఎన్‌సిబి బృందం అక్టోబర్ 3న అరెస్టు చేసింది.…

Read More

అత్యాధునిక ఆయుధాలు, సంఖ్యాపరంగా పలు రేట్లు ఉన్నప్పటికీ రష్యా సైనికులు ఉక్రెయిన్ సైనికుల ప్రతిఘటన ముందు నిలబడలేక పోవడానికి, గత వారం రోజులుగా అనుకున్నంతగా పురోగతి సాధింపలేక పోవడానికి రష్యా సైనికులలో యుద్ధం అంటే వణుకు పుట్టడమే కారణంగా ప్రచారం జరుగుతున్నది.  ‘కనిపించిన ప్రతిదాన్నీ కాల్చేయండి’ అని ఆదేశాలు రావడంతో దిగ్భ్రాంతికి గురై, వారు ఏడుస్తున్నారని, యుద్ధంలో ఉపయోగించే వాహనాలను స్వయంగా ధ్వంసం చేస్తున్నారని చెబుతున్నారు. ఈ వివరాలను ఓ పెంటగాన్ అధికారిని ఉటంకిస్తూ అమెరికన్ మీడియా బుధవారం వెల్లడించింది.  రష్యా దళాల్లో ఎక్కువ మంది యువత ఉన్నారు. వీరికి పూర్తి స్థాయి యుద్ధంలో సరైన శిక్షణ లేదు. వారిలో ఆత్మస్థయిర్యం కూడా తక్కువే. అంతేకాకుండా ఆహారం, ఇంధనం వంటి వనరుల కొరత కూడా వారిని వేధిస్తోంది.  దీంతో యుద్ధం చేయకుండా తప్పించుకోవడం కోసం వారు తాము ప్రయాణిస్తున్న వాహనాలకు ఉద్దేశపూర్వకంగా పంక్చర్లు చేస్తున్నారు. ఈ వివరాలను బందీలైన రష్యా సైనికులు చెప్పినట్లు ఆ…

Read More