తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై ఈ నెల 17న కేంద్ర హోంశాఖ జరుపనున్న భేటీకి సంబంధించిన అజెండా నుండి ప్రత్యేక హోదా అంశాన్నికేంద్రం తొలగించడం ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేపుతున్నది. ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు అంశాలను తొలగిస్తూ లేఖ రాసింది. విభజన కమిటీ అజెండాలో ఏపీ ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు లేదని తెలిపింది. మొదట ఇచ్చిన సర్క్యులర్‌లో ఎనిమిదో అంశంగా ప్రత్యేక హోదా ఉంది. హోదా అంశాన్ని తొలగిస్తూ కేంద్రం మరో సర్క్యులర్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి ముగ్గురు సభ్యులతో కేంద్ర హోంశాఖ కమిటీ ఏర్పాటు చేయనుంది. ఎజెండాలో సవరణలు చేస్తూ రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. 9 అంశాల నుంచి 5 అంశాలకే కేంద్ర హోంశాఖ పరిమితం చేసింది. త్రిసభ్య కమిటీ ఎజెండాలో ఏపీ ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు లేదని తెలిపింది. వెనుకబడిన జిల్లాకు నిధులు, పన్ను రాయితీలను కేంద్రం…
Author: Editor's Desk, Tattva News
బ్యాంక్‌లకు వేల కోట్లు కన్నం వేసిన విజయ మాల్యా, నీరవ్ మోడీల వ్యవహారం మర్చిపోకముందే మరో ఘటన బయటపడింది. గుజరాత్ కేంద్రంగా పనిచేస్తున్న ఎబిజి షిప్‌యార్డ్ కంపెనీ దేశంలోని 28 బ్యాంక్‌లకు టోకరా ఇచ్చింది. ఐసిఐసిఐ బ్యాంక్ కన్సోరియంలోని పలు బ్యాంక్‌లకు ఏకంగా రూ.22,842 కోట్లకు మోసం చేసింది. ఇప్పటి వరకు దేశంలో ఇదే పెద్ద రుణాల ఎగవేత కుంభకోణం. దీంతో ఆ కంపెనీ సిఎండి, డైరెక్టర్లపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) తాజాగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఎబిజి షిప్‌యార్డ్ సిఎండి రిషి కమలేష్ అగర్వాల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతానమ్ ముతస్వామి, మరో ముగ్గురు డైరెక్టర్లు అశ్వినీ కుమార్, సుశీల్ కుమార్ అగర్వాల్, రవి విమల్ నెవెటియాలపై మోసం, క్రిమినల్ కేసులు పెట్టింది. ఎబిజి గ్రూప్ గుజరాత్‌లోని సూరత్ కేంద్రంగా పనిచేస్తుంది. షిప్‌ల తయారీ, వాటి రిపేర్ వ్యాపారాలను కలిగి ఉంది. గత 16 ఏళ్లలో 165 వాణిజ్య…
ధరలు పెరిగి జీవన వ్యయం పెరుగుతూ ఉండడంతో భారత్ వంటి దేశాలలోనే కాకుండా సంపన్నదేశమైన బ్రిటన్ లో కూడా ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి. మెరుగైన ఉపాధి, జీవన ప్రమాణాలు కావాలంటూ సెంట్రల్ లండన్‌లో వేలాది మంది ప్రదర్శన నిర్వహించారు. ఇతర ప్రాంతాల్లో కూడా వేలాదిమంది కార్మికులు, ప్రజలు, కార్యకర్తలు వీధుల్లోకి వచ్చారు. లండన్, మాంచెస్టర్, బ్రైటన్, బ్రిస్టల్, గ్లాస్గో, కార్డిఫ్‌లతో సహా దేశవ్యాప్తంగా 30 పట్టణాలు, నగరాల్లో నిరసన ర్యాలీలు జరిగాయి. పీపుల్స్ అసెంబ్లీ అగైనెస్ట్ ఆస్టిరిటీ సంస్థ ఈ ఆందోళనలకు పిలుపునిచ్చింది. డజన్ల సంఖ్యలో కార్మిక సంఘాలు, ప్రచార గ్రూపులు ఈ నిరసనలకు మద్దతిచ్చాయి, ప్రధాని బోరిస్ జాన్సన్ వ్యవహార శైలిపై ప్రజల్లో గూడుకట్టుకున్న అసంతృప్తి నిరసనల్లో స్పష్టంగా బయటపడింది. వేతనాలు, పెన్షన్లలో కోతలు, పెరుగుతున్న ఇంధన ధరలు, వీటికి తోడు కోవిడ్ సంక్షోభ ప్రభావంతో వేలాది మంది ప్రజలు రోడ్డున పడ్డారు. తమ కుటుంబ అవసరాలను కూడా తీర్చలేని స్థితిలో వున్నారు.…
ఐదేళ్ల యోగి ఆదిత్యనాథ్ పాలనలో ఇటీవల కాలంలో ఉత్తర ప్రదేశ్ నేరాలకు దూరంగా, శాంతి భద్రతల పరిరక్షణలో అద్భుతంగా పనిచేసినదని బీజేపీ ప్రధాన ఎన్నికల ప్రచార అస్త్రంగా ఉపయోగిస్తుంది. అఖిలేష్ యాదవ్ తిరిగి ముఖ్యమంత్రి అయితే `గూండాల పాలన’ తిరిగి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిస్తున్నారు. వాస్తవాలు ఏవిధంగా ఉన్నప్పటికీ ఆదిత్యనాథ్ పాలన జర్నలిస్టుల పట్ల కాళరాత్రిగా మారినట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా వారు వేధింపులకు, దాడులకు గురైనట్లు కూడా ఆరోపణలు చెలరేగుతున్నాయి. తాజాగా, జర్నలిస్టులపై దాడికి వ్యతిరేకంగా కమిటీ (సిఎఎజె) విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ ఐదేళ్లలో 12 మంది జర్నలిస్టులు హత్యలకు గురికాగా, 48 మంది జర్నలిస్టులు భౌతిక దాడులకు గురయ్యారు. 66 మందిపై వివిధ కేసులను నమోదు చేశారు. ఐదేళ్లలో దాడులు, 138 దాడులు కేసులు నమోదు కాగా, ఆందోళనకరమైన అంశం ఏమిటన్తి, వాటిలో 75 శాతం కరోనా మహమ్మారి సమయంలో నమోదయినవే. ఈ దాడులలో అత్యధికంగా…
ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపిలపై కొద్దీ రోజులుగా ముప్పేట దాడులకు దిగుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తొలిసారిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పట్ల సానుభూతి తెలిపారు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత బిజెపిపై దండెత్తే క్రమంలో కాంగ్రెస్ పట్ల సానుకూలంగా మాట్లాడటం ఇదే ప్రధమం కావడం గమనార్హం. రాహుల్ గాంధీ పుట్టుకపై అసోం ముఖ్యమంత్రి, బిజెపి నేత హేమంత్ బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంపీగా రాహుల్ ప్రశ్నిస్తే , బిజెపి సమాధానం చెప్పలేకపోయిందని ధ్వజమెత్తారు. తండ్రి గురించి తప్పుగా మాట్లాడటం బిజెపి విధానమా? అంటూ ప్రశ్నించారు. జేపీ నడ్డా, మోడీలు సమాధానం చెబుతారా? అని నిలదీశారు. పైగా, రాహుల్ పై శర్మ మాటలు విని తనకు కన్నీళ్లొచ్చాయని కేసీఆర్ తీవ్రమైన సానుభూతి చెలపడంతో పాటు అస్సాం సీఎంని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై , బీజేపీ విమర్శలను…
ఉక్రెయిన్‌పై రష్యా ఎప్పుడైనా దాడి చేసే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల మేరకు అమెరికా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని తన రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయనుంది.అక్కడి అమెరికన్ దౌత్య సిబ్బంది దేశం విడిచి రావాలంటూ విదేశాంగ శాఖ ప్రకటన జారీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇది వరకే తమ దౌత్యవేత్తల కుటుంబ సభ్యులు స్వదేశానికి చేరుకోవాలని ఆదేశించిన అగ్రరాజ్యం సిబ్బంది విషయంలో మాత్రం వారి ఆలోచనకు వదిలివేసింది. కానీ ,తాజాగా వారినీ రప్పించేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. కొంతమంది దౌత్యవేత్తలకు తమ మిత్ర దేశమైన పోలాండ్ సరిహద్దు సమీపంలోకి మార్చే అవకాశాలు ఉన్నాయని ఓ అధికారి చెప్పారు. ఇటీవల పోలాండ్‌కు దాదాపు 1700 మంది భధ్రతా సిబ్బందిని తరలించిన అమెరికా తాజాగా మరో మూడువేల మంది సైనికులకు పంపనున్నట్లు ప్రకటించింది. నాటో బలగాలకు శిక్షణ అందించడమే వారి లక్ష్యమని, ఉక్రెయిన్‌లోకి ప్రవేశించడం కాదని తెలిపింది. ఉక్రెయిన్‌లోని అమెరికా…
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితులకు కడప జైలులో హాని ఉందని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. వారి హత్యకు కుట్ర జరుగుతోందని తెలిపారు. మొద్దుశ్రీను హత్య సమయంలో అనంతపురం జైలర్‌గా ఉన్న వరుణ్‌రెడ్డిని ఇప్పుడు కడప జైలర్‌గా నియమించారని చెప్పారు. వివేకా హత్యకేసులో నిందితులు ప్రస్తుతం కడప జైలులో ఉన్నారని పేర్కొన్నారు. కడప జైలర్‌గా వరుణ్‌రెడ్డి నియామకంపై సీబీఐకి లేఖ రాయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. జగన్‌రెడ్డి , అవినాష్‌రెడ్డి సాయంతో వరుణ్‌రెడ్డి ద్వారా వారికి ప్రాణహాని పొంచి ఉందని మాజీ ముఖ్యమంత్రి ఆరోపించారు. శనివారం విజయవాడ పటమటలోని తమ పార్టీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఇంటికి వెళ్లిన చంద్రబాబు ఆయన్ను పరామర్శించారు. సీఐడీ అరెస్టు, తదనంతర పరిణామాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ .. ఎక్కడ అన్యాయం జరిగినా .. పరిష్కారం కోసం టిడిపి ముదుంటుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ అశోక్‌బాబును అన్యాయంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. ముగ్గురు మాజీ…
బీజేపీ కార్యకర్తలను నశం పెట్టి కొడుతామని కేసీఆర్ హెచ్చరిస్తారా..కేసీఆర్ నశంపెడితే తాము జండూబామ్ పెడుతామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేసారు. జనగామ సభలో సీఎం కేసీఆర్ బీజేపీ నేతలపై చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. శనివారం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. కేసీఆర్ పై ఖచ్చితంగా దర్యాప్తు జరుగుతుందని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి అయి ఉండి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారన్న బండి సంజయ్.. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని జనగామ సభ నుంచే అమలు చేస్తున్నానని భ్రమలో ఉన్నాడని ధ్వజమెత్తారు. నోరు తెరిస్తే మందువాసన వచ్చే కేసీఆర్ ను పక్కాగా సభలోనే డ్రంక్ అండ్ డ్రైవ్ చేపిస్తం అని చెప్పారు. అన్నారు. తాగినట్లు తేలితే… జైలుకు పంపుతామని.. ఆ స్కీం కేసఆర్ కోసం కచ్చితంగా తీసుకొస్తా మని తెలిపారు. సభ సందర్భంగా బీజేపీ కార్యకర్తలను దౌర్జన్యంగా అరెస్ట్ చేశారని సంజయ్ మండిపడ్డారు. సీఎం సభకు రెండ్రోజుల ముందు నుండే కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. …
టీడీపీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు పి.అశోక్‌బాబును లోకాయుక్త ఆదేశంపై కేసు నమోదు చేసి, సిఐడి అర్ధరాత్రి అరెస్ట్ చేయడంపై ఏపీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. సర్వీస్ రికార్డు విషయంలో సీఐడీతో దర్యాప్తు చేయించాలని లోకాయుక్త ఆదేశించడంపై మండిపడింది. అరెస్ట్ కు కారణమైన లోకాయుక్తను తన కేసులో ప్రతివాదిగా చేర్చమని అశోక్‌బాబును ఆదేశించింది. ఈ విషయంలో లోకాయుక్త విచారణాధికార పరిధి ఏమిటో అర్థం కావడం లేదని పేర్కొంటూ ఈ ఆదేశాలివ్వడానికి దానికి ఉన్న అధికారాలు ఏమిటని ప్రశ్నించింది. ఇలాంటి చర్యలను జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా ఉందని అసహనం వ్యక్తం చేసింది. ఎలాంటి ప్రాథమిక విచారణా లేకుండా లోకాయుక్త ఆదేశాల మేరకు పిటిషనర్‌పై సీఐడీ కేసు నమోదు చేసినట్లుగా ఉందని అభిప్రాయపడింది. సర్వీస్ రిజిస్టర్‌లో విద్యార్హతలు ఎవరు, ఎప్పుడు ట్యాంపర్ చేశారో కనీస సమాచారం లేకుండా కేసు నమోదు చేసిన సీఐడీ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వ్యక్తులపై కేసులు నమోదు చేసే…
స్వేచ్ఛా, బహిరంగ, సమ్మిళిత ఇండో పసిఫిక్‌ను సాధించేందుకు, ఉగ్రవాదం వంటి ఉమ్మడి శత్రువును సమిష్టిగా ఎదుర్కొనేందుకు కృషి చేయాలని క్వాడ్ విదేశాంగమంత్రుల సమావేశం నిర్ణయించింది. భారత్ పై జరిగిన ఉగ్రవాద దాడులపై క్వాడ్ నేతలు మొదటిసారిగా స్పందించారు. ఆస్ట్రేలియా ఆతిధ్యంలో శుక్రవారం మెల్‌బోర్న్ లో జరిగిన ఈ సమావేశానికి అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్, జపాన్ విదేశాంగ మంత్రి యోషిమస హయషి, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మెరైజ్ పేన్ హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా గోష్టిలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పేన్ మాట్లాడుతూ, దేశ సార్వభౌమత్వ పరిరక్షణ, బహిరంగ, సమ భాగస్వామ్యం వంటి విలువలకు క్వాడ్ తన మద్దతును పునరుద్ఘాటించిందని పేర్కొన్నారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ, క్వాడ్ దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టవంతం కావాలని కోరారు. దృఢమైన సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం క్వాడ్‌ను…