Author: Editor's Desk, Tattva News

దేశంలోని వివిధ బ్యాంకుల నుండి రుణాలను తీసుకుని, ఎగ్గొడుతూ రూ 1,626 కోట్ల మేరకు కుంభకోణంకు పాల్పడినట్లు దేశంలో ప్రముఖ ప్రైవేట్ యూనివర్సిటీ అయిన అశోక యూనివర్శిటీ వ్యవస్థాపకులు వినీత్‌ గుప్తా, ప్రణవ్‌ గుప్తాలపై సిబిఐ అభియోగాలు నమోదు చేసింది. చండీఘర్‌కు చెందిన పార్మాసూటికల్‌ కంపెనీ పారాబోలిక్‌ డ్రగ్స్‌కు సంబంధించిన ఈ కుంభకోణంపై దర్యాప్తు జరిపింది. ఫార్మా సంస్థ, ప్రణవ్‌, వినీత్‌ గుప్తాలతో పాటు మరో 10 మందిపై సిబిఐ కేసు నమోదు చేసింది. వీరంతా సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, మరో 11 బ్యాంకులను మోసగించారని తెలిపింది. గత నెల 31 పలు నగరాల్లో గుప్తాలకు చెందిన ప్రాంగణాల్లో సోదాలు చేపట్టగా పత్రాలు, ఆర్టికల్స్‌, రూ. 1.58 కోట్ల విలువ చేసే నగదును స్వాధీనం చేసుకున్నామని సిబిఐ పేర్కొంది. గుప్తాలపై ఫోర్జరీ, నేరపూరిత కుట్ర వంటి అభియోగాలు నమోదు చేశారు. అశోక యూనివర్శిటీ వెబ్‌ సైట్‌లో వినీత్‌ గుప్తా వ్యవస్థాకుడు, ట్రస్టీగా, ప్రణావ్‌ గుప్తా…

Read More

ఎపి లోని వైసిపి తిరుగుబాటు పార్లమెంట్‌ సభ్యుడు రఘురామరాజు త్వరలో తాను ఎంపి పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళతానని ప్రకటించారు. ”అమరావతి రాజధానితోపాటు ప్రజలకు మంచి చేయడం కోసం, రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలించడం కోసం తాను నిర్ణయం తీసుకోబోతున్నా”నని వెల్లడించారు. తమ పార్టీకి చెందిన ఎంపి లు తనపై అనర్హత వేటు వేయించాలని ప్రయత్నిస్తున్నారని, అనర్హత ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని రఘురామరాజు స్పష్టం చేశారు. వారి ప్రయత్నాలకు ఇంకా సమయం ఇస్తున్నానని అంటూ ఒక విధంగా సవాల్ చేశారు. అనర్హత వేటు వేయించకపోతే తానే రాజీనామా చేసి, మళ్లీ ఎన్నికలకు వెళతానని రఘురామ వెల్లడించారు. పార్టీపై ఎంత వ్యతిరేకత ఉందో ఎన్నికల ద్వారా తెలియజేస్తానని చెప్పారు. కొంతకాలంగా ఎపి సిఎం జగన్‌ వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీకి దూరంగా ఉంటున్న రఘురామరాజు చేసిన వ్యాఖ్యలు సంచలనాన్ని రేపాయి. ఈ సందర్భంగా వాలంటరీ వ్యవస్థ, ప్రభుత్వ ఉద్యోగుల గురించి కూడా ఆయన మాట్లాడుతూ…

Read More

గత నాలుగేళ్లుగా, 2017-21 మధ్య ప్రతి ఏడాది లక్ష మందికి పైగా యువత ఆర్ ఎస్ ఎస్ కార్యక్రమాల పట్ల ఆసక్తి చోపుతున్నారని అంటూ, చాలామంది తమ వెబ్ సైట్ ద్వారా కూడా చేరుతున్నారని రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) స‌హ స‌ర్ కార్యవాహ డా. మ‌న్మోహ‌న్ వైద్య‌ వెల్లడించారు. వారి సంఖ్య ఏడాదికి 1 లక్ష నుండి 1.25 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. సంఘ్ నేడు ప్రపంచంలో నే యువత అత్యధికంగా ఉన్న సంస్థ అని చెబుతూ ప్రస్తుత దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ జరుగుతున్న 55 వేల సంఘ్ శాఖలలో హాజరవుతున్న వారిలో 60 శాతం మంది వరకు విద్యార్థులే ఉంటున్నారని తెలిపారు. మిగిలిన వారు ఉద్యోగులు, ఇతరులని చెప్పారు. ఇటీవల కాలంలో యువతలో సంఘ్ పట్ల ఆసక్తి గణనీయంగా పెరుగుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్ లో ఈ నెల 5 నుండి మూడు రోజులపాటు జరిగిన సంఘ్ ప్రేర‌ణతో వివిధ రంగాల్లో ప‌నిచేస్తున్న…

Read More

బంగ్లా యుద్ధం – 22 1971 యుద్ధంలో అత్యంత కీలకమైన తుది ఘట్టం తూర్పు పాకిస్థాన్ రాజధాని ఢాకాను స్వాధీనం చేసుకోవడం. అందుకోసం మేఘన నది నుండి జరిపిన యాత్ర. ఢాకా స్వాధీనంతో యుద్ధం ముగిసింది. గత్యంతరం లేక, మరో మార్గం లేక పాకిస్థాన్ సైనికులు భారత సేనాని ముందు లొంగిపోయేటట్లు చేసింది.   గ్రీన్‌హార్న్‌గా ఢాకాలోకి దూసుకెళ్లిన ట్యాంక్ స్క్వాడ్రన్‌కు నాయకత్వం వహించిన మాజీ వెస్ట్రన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఎస్ ఎస్  మెహతా (రిటైర్డ్) ఆ నాటి చారిత్రాత్మక మైన, స్ఫూర్తిదాయక ఘటనలను సవివరంగా గుర్తు చేసుకొంటూ గ్రంధస్తం చేశారు.  ఈ ఘటం తోనే దక్షిణాసియా చిత్రపటం మారిపోయింది. బాంగ్లాదేశ్ అనే మరో కొత్త దేశం ఆవిర్భవించింది. మతం ఆధారంగా ఏర్పడిన పాకిస్థాన్ సామజిక, సాంస్కృతిక వైరుధ్యాల కారణంగా ముక్కలై, పాకిస్థాన్ ఏర్పాటు కుట్రపూరితంగా జరిగినదని, అందుకు ఎటువంటి ప్రాతిపదిక లేదని స్పష్టం చేసింది.  కేవలం 3000 మంది భారత సైనికుల ముందు…

Read More

అత్యాధునిక ఆయుధాలను, సైనిక మౌలిక సదుపాయాలను పెంపొందించడం ద్వారా చైనా యుద్దానికి సన్నద్ధమవుతున్నట్లు అమెరికా అనుమానిస్తున్నది. చైనా సైనిక వ్యూహాలు, బలాలకు సంబంధించిన కొద్దికాలం క్రితం విడుదల చేసిన కీలకమైన పత్రాలు ఈ అంశాన్ని వెల్లడి చేస్తున్నాయి.   చైనా ప్రభుత్వం ప్రస్తుతం సైన్యంపై పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయడం ద్వారా కొత్త ఆయుధాలను తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసి అమలుపరుస్తున్నది. 2035 నాటికి చైనా తన పాత ఆయుధాలన్నింటినీ తొలగిస్తుందని భావిస్తున్నారు.  ఇప్పటికే కృత్రిమ మేధస్సు, యాంటీ-షిప్ బాలిస్టిక్ క్షిపణులతో సహా ప్రపంచంలోని ప్రముఖ మిలిటరీలలో ఒకటిగా చైనా ఉంది. చైనా సైన్యం ఆధునికీకరించడంతో తైవాన్‌పై ఒత్తిడి పెరిగి, తూర్పు మరియు దక్షిణ చైనా సముద్రాలలో వివాదాస్పద ద్వీపాలను సైనికపరంగా ఆధీనంలో ఉంచుకొనడం ద్వారా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మరింత దూకుడుగా చైనా వ్యవహరించే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సైనికపరంగా ఆధిపత్యంలో ఉండడంతో పాటు అమెరికాను సహితం…

Read More

ప్రధాని నరేంద్ర మోదీ నిన్న పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో పర్యటించిన సందర్భంగా భద్రతా ఉల్లంఘనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ లోపాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ విషయంలో పంజాబ్ పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగా తప్పుదోవపట్టి వ్యవహరించి ఉంటారని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ అధికారులు అనుమానిస్తున్నట్లు తెలుస్తున్నది. నిరసనకారుల గురించి నిఘా ఇన్‌పుట్‌లు ఉన్నప్పటికీ, ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కోసం ఆకస్మిక మార్గాన్ని సిద్ధం చేయకపోవడమే ఈ విస్తృత కసరత్తు వెనుక కొన్ని బలమైన ‘రాజకీయ ఉద్దేశ్యాన్ని’ వెల్లడిస్తుంది. పంజాబ్‌లో బుధవారం ప్రధానికి సంబంధించిన అపూర్వమైన భద్రతా ఉల్లంఘనకు కీలకం ఏమిటంటే, ఆయన గమ్యస్థానమైన హుస్సేనివాలా జాతీయ అమరవీరుల స్మారకానికి 30 కి.మీ దూరంలో ఉన్న హుస్సేనివాలా జాతీయ అమరవీరుల స్మారకానికి వెళ్లే మార్గంలో ఫ్లైఓవర్‌పై 15 నిమిషాల పాటు ఆయన కాన్వాయ్ 15 నిమిషాల పాటు నిలిపివేశారు.ఉదయం 10.20 గంటలకు భిసియానా విమానాశ్రయంలో ప్రధాని దిగినప్పుడు భటిండాలో…

Read More

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే నెల ఎన్నికలు జరుగనున్న తరుణంలో కరోనా మహమ్మారి మరోసారి పడగ విప్పడంలో రాజకీయ నాయకులు ఖంగారు పడుతున్నారు. ఎన్నికల ప్రచారంకు వెళ్ళడానికి జంకుతున్నారు. కరోనా ప్రమాదం దృష్ట్యా ఎన్నికలను రెండు, మూడు నెలలపాటు వాయిదా వేయాలని అలాహాబాద్ ఎన్నికల కమీషన్ గతనెలలోనే సూచించడం గమనార్హం. అయితే, ఎన్నికల కమీషన్ ముందు కరోనా నిబంధనలు పాటిస్తూ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరపాలని అన్ని రాజకీయ పార్టీలు కోరాయి. దానితో యధావిధిగా ఎన్నికలు జరుపుతున్నట్లు కమీషన్ ప్రకటించింది. కానీ ఇప్పుడు ఎన్నికలపై కరోనా ప్రభావం పడినట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా బిజెపి, కాంగ్రెస్ నాయకులు తమ ఎన్నికల పర్యటన కార్యక్రమాలను వాయిదా వేసుకొంటున్నారు. మహమ్మారి కారణంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నోయిడా ర్యాలీని రద్దు చేసుకున్నారు. నోయిడాలో గురువారం ముఖ్యమంత్రి ప్రచారం చేపట్టాల్సి ఉండగా అక్కడ కరోనా కేసులు రికార్డుస్థాయిలో పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అటు కాంగ్రెస్ కూడా వారి ప్రచార ర్యాలీలు రద్దుచేసుకుంది. లడ్కీ మారథాన్ పేరిట నిర్వహిస్తున్న…

Read More

ఇప్పటికే హైటెక్‌ సిటీ, ఫార్మాసిటీ వంటి సిటీలతో దేశంలో ప్రతిష్టాకరమైన పలు నిర్మాణాలకు నెలవుగా గుర్తింపు పొందిన  హైదరాబాద్‌ లో ఇపుడు మరో సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైనది.  హైదరాబాద్‌ మహానగరంలో సైన్స్‌ సిటీ ఏర్పాటు ప్రతిపాదనను కేంద్రపర్యాటక శాఖామంత్రి జి  కిషన్‌రెడ్డి రాష్ట్రానికి పంపారు.  కేంద్ర పర్యాటక అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సైన్స్‌ మ్యూజియాల జాతీయ మండలి దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పలు నగరాల్లో సైన్స్‌ సిటీలు, సైన్స్‌ సెంటర్లు, ఇన్నోవేషన్‌ హబ్‌లు, డిజిటల్‌ ప్లానటోరియాల్ని ఏర్పాటు చేస్తున్నారు.  ఇందులో భాగంగా హైదరాబాద్‌ మహానగరంలో సైన్స్‌ సిటీని ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి ఇటీవల లేఖ రాశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టు వివరాల్ని తెలంగాణ ప్రభుత్వానికి పంపారు.  దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ సైన్స్‌ సిటీలో భాగంగా ఇంటరాక్టివ్‌ సెషన్‌ ఎగ్జిబిషన్‌ హాళ్లు, డిజిటల్‌ థియేటర్లు, త్రీడీషోలు, స్పేస్‌ సైన్స్‌…

Read More

తనకు, బిజెపి వారికి జైలుకు వెళ్లడం కొత్తకాదని అంటూ ఇక సీఎం కేసీఆర్ ను కూడా జైలుకు పంపుతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంబధం చేశారు. హైకోర్టు ఉత్తరువుతో గతరాత్రి కరీంనగర్ జైలునుండి విడుదలైన ఆయన కేసీఆర్ జైలు వెడితే ఆయనను కాపాడే వారెవ్వరూ ఉండబోరని హెచ్చరించారు. తాను ఉద్యోగులు, ఉపాధ్యాయులు కోసం జైలుకు వెళ్లానని, అయితే కేసీఆర్‌ మాత్రం వేరే అంశంపై జైలుకు వెళ్తారని అంటూ పరోక్షంగా అవినీతి కేసులపై వెడతారనే సంకేతం ఇచ్చారు. జీవోను వెంటనే సవరించకుండా కేసీఆర్‌ సంగతి చూస్తానంటూ హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తల చేతులు, కాళ్లు విరగొట్టారని, మహిళా కార్యకర్తలపై అసభ్యంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కార్యాలయంపై దాడి చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. “మేము ఏమైనా దుండగులమా, హంతకులమా దోపిడి దారులమా.. ధర్మం కోసం, తెలంగాణ సమాజం కోసం పనిచేసే వ్యక్తులం. భయపడం” అంటూ స్పష్టం చేశారు. ఉద్యోగులు ఇప్పుడు కూడా స్పందించకుంటే జీవితాంతం ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుందని సంజయ్ చెప్పారు. తెలంగాణలో ధర్మ యుద్దం ప్రారంభమైందని,…

Read More

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం కారణంగా ఆయన అర్ధాంతరంగా పర్యటనను ముగించుకొని వెనుతిరగడం పట్ల కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. పంజాబ్ శాసన సభకు త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో పాల్గొనవలసిన తొలి బహిరంగ సభ రద్దయింది. ఫిరోజ్‌పూర్‌లో బుధవారం ఈ సభ జరగవలసి ఉండగా, ప్రధాన మంత్రి భద్రత విషయంలో తీవ్ర లోపం ఉందని, అందువల్లే ఈ సభ రద్దయిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. రెండేళ్ల తర్వాత తొలిసారిగా ప్రధాని పంజాబ్ పర్యటనకు వెళ్లారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ వార్తా సంస్థకు తెలిపిన వివరాల ప్రకారం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఉదయం భటిండా చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్లో హుస్సేనీవాలాలోని జాతీయ అమరవీరుల స్మారక కేంద్రానికి వెళ్ళవలసి ఉంది. వర్షం కురుస్తుండటం, దారి కనిపించకపోవడం వల్ల ఆయన దాదాపు…

Read More