Author: Editor's Desk, Tattva News

వైసిపి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర గురువారం శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభం కానుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మొత్తం 17 మంది మంత్రులు ఈ యాత్రలో పాల్గొననున్నారు.  గురువారం నుంచి 4 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. రోజుకొకటి చొప్పున విజయనగరం, రాజమహేంద్రవరం, నరసరావుపేట, అనంతపురంలలో బహిరంగ సభలు నిర్వహించి మంత్రులు ప్రసంగించనున్నారు.  తొలిరోజు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఏడు రోడ్ల కూడలిలో ఉన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి యాత్ర ప్రారంభిస్తారు. ఎచ్చెర్ల, రణస్థలం మీదుగా విజయనగరం వెళ్తారు. అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో మంత్రులు మాట్లాడతారు.  అనంతరం బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. 27న విశాఖలో బయలుదేరి గాజువాక, లంకెలపాలెం కూడలి, అనకాపల్లి జంక్షన్‌, తాళ్లపాలెం జంక్షన్‌, యలమంచిలి వై జంక్షన్‌, నక్కపల్లి, కత్తిపూడి, జగ్గంపేట మీదుగా రాజమహేంద్రవరం చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభ నిర్వహించి రాత్రికి తాడేపల్లిగూడెం…

Read More

జమ్మూ కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ (56) ఉగ్రవాదులకు నిధులు అందించిన కేసులో ఢిల్లీలోని పటియాల హౌస్‌ కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది. భారీ భద్రత నడుమ మాలిక్ ను బుధవారం మధ్యాహ్నం కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి తుది తీర్పును వెలువరించారు. ఎన్ఐఏ మరణ శిక్ష విధించాలని వాదించగా ధర్మాసనం యావజ్జీవ శిక్ష విధించింది. ఈనెల 19నే మాలిక్ ను దోషిగా తేల్చిన కోర్టు తాజాగా బుధవారం సాయంత్రం ఈ మేరకు శిక్షను విధిస్తూ తీర్పును ఇచ్చింది. టెర్రర్‌ ఫండింగ్‌ కేసులో తనపై నమోదైన అన్ని అభియోగాలను యాసిన్‌మాలిక్‌ అంగీకరించాడు. వాటిని కోర్టులో సవాలు చేయడానికి కూడా నిరాకరించాడు. దీంతో ఎన్‌ఐఏ కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. 1989లో జరిగిన కశ్మీరీ పండిట్ల హత్యల్లోనూ జేకేఎల్ఎఫ్ నాయకుల పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. వీరి దురాగతాలతో కశ్మీర్ నుంచి భారీ సంఖ్యలో పండిట్లు వలస వెళ్లారు.1984లో జరిగిన…

Read More

రాయపూర్‌-విశాఖపట్నం ఎకనమిక్‌ కారిడార్‌కు సంబంధించి భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు. ఈ ఎకనమిక్‌ కారిడార్‌ ఏర్పాటుతో చత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఎపికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. మే నెల ప్రగతి అంశాలపై బుధవారం ఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వీటితోపాటు కాకినాడ- శ్రీకాకుళం సహజ వాయువు పైపులైను ప్రాజెక్టుల ప్రగతి, నేషనల్‌ బ్రాండ్‌ బ్యాండ్‌ మిషన్‌ గురించి సిఎస్‌లతో ప్రధాన మంత్రి సమీక్షించారు. అల్యూమినియం, బొగ్గు, బాక్సైట్‌ వంటి విలువైన ఖనిజాలు విశాఖపట్నం ఓడరేవు ద్వారా ఎగుమతి, దిగుమతులకు ఎంతో ఉపయోగం ఉంటుందని మోదీ పేర్కొన్నారు. కాకినాడ -శ్రీకాకుళం సహజవాయువు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. నేషనల్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ మిషన్‌ గురించి…

Read More

ఇటీవల ఓ బ్రాహ్మణ సమావేశంలో మాట్లాడిన బీజేపీ నేత, నాలుగుసార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన అరవింద్ శర్మ హర్యానాలో బ్రాహ్మణ ముఖ్యమంత్రి కావాలని వాదించారు. ఒకప్పుడు 20-22 రాష్ట్రాల్లో 10 రాష్ట్రాల్లో బ్రాహ్మణ సీఎంలు ఉండేవారని గుర్తు చేశారు. ఈ నెల ప్రారంభంలో, కేంద్ర మంత్రి, మహారాష్ట్ర బిజెపి మాజీ అధ్యక్షుడు రావుసాహెబ్ దాన్వే సహితం ఇలా అన్నారు: “బ్రాహ్మణులను మున్సిపల్ కౌన్సిలర్లు లేదా కౌన్సిల్ అధ్యక్షులుగా చూడాలని నేను కోరుకోవడం లేదు. ఈ రాష్ట్రానికి ఒక బ్రాహ్మణుడు ముఖ్యమంత్రి పదవిని అధిష్టించాలని నేను కోరుకుంటున్నాను”. భారతదేశ జనాభాలో 10 శాతం కంటే తక్కువగా ఉన్నప్పటికీ, దేశ రాజకీయ వ్యవస్థలో సుదీర్ఘకాలం వహించిన ఆధిపత్యం ఇప్పుడు క్షీణిస్తూ ఉండడం పట్ల కలత చెందుతున్న  బ్రాహ్మణ సమాజానికి చెందిన అనేక మంది నాయకుల మనోభావాలనే వారు వ్యక్తం చేసారని చెప్పవచ్చు.   బహిరంగంగా ఎవ్వరు చెప్పక పోయినప్పటికీ, అత్యధిక జనాభా కలిగిన, రాజకీయంగా ముఖ్యమైన రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో సహితం…

Read More

2024 ఎన్నికలకు పార్టీ కార్యకర్తలను సంసిద్ధం చేసే దిశలో ఈ నెల 27, 28 తేదీల్లో ప్రకాశం జిల్లా ఒంగోలులో తెలుగుదేశం పార్టీ మహానాడు జరపడానికి పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్ టి రామారావు శతజయంతి సంవత్సరం ప్రారంభం కావడం, పార్టీ ప్రారంభించి 40 ఏళ్ళు కావడంతో ఈ మహానాడుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. పైగా, కరోనా కారణంగా, అంతకు ముందు ఎన్నికల కారణంగా గత మూడేళ్ళుగా మహానాడు పెద్ద ఎత్తున జరపలేక పోయారు. మరోవంక రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ దృష్ట్యా ఈ మహానాడుకు టిడిపికి చెందిన పలువురు నేతలు నెల రోజులుగా ఇక్కడే ఉండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుండి మహానాడుకు పది వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారని చెప్తున్నారు. చివరిరోజు బహిరంగ సభకు మూడు లక్షల మందిని సమీకరించాలని నిర్ణయించారు. అధికార వైసిపి నేతలు ‘గడపగడపకూ..’ కార్యక్రమం పేరుతో…

Read More

నేరాలకు పాల్పడేవారికి వత్తాసు పలికేలా అధికార యంత్రాంగాన్ని పాలకులు వినియోగించుకుంటుంటే ఇక శాంతిభద్రతల గురించి ఆలోచన కూడా చేయలేమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వైసిపి ప్రభుత్వంపై మండిపడ్డాయిరు.  కాకినాడలో ఎస్సీ యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసుల వ్యవహార శైలి, ఆ హత్య తానే చేశానని ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ ఒప్పుకొన్న తరవాత కూడా అధికారులు అతని పట్ల అత్యంత గౌరవ మర్యాదలు కనబరిచిన తీరు చూస్తే విస్మయం కలుగుతోందని ఆయన ధ్వజమెత్తారు.  సామాన్యుల పట్ల కూడా ఇంతే సహృదయత కనబరుస్తారా? అని ప్రశ్నించారు, ఈ విధమైన తీరుకి పోలీసుల కంటే వారిపై ఆధిపత్యం చలాయిస్తున్న రాజకీయ బాసులే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడి కత్తి కేసులో ఆంధ్రప్రదేశ్‌ పోలీసులపై నమ్మకం లేదు అన్నవారే ఇప్పుడు ఆ శాఖకు దిశానిర్దేశం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.  కోడి కత్తి కేసు పురోగతి ఏమిటో తెలియదని, పులివెందులలో వివేకానంద రెడ్డి హత్య…

Read More

ఇండో పసిఫిక్‌ ప్రాంతం స్వేచ్ఛను పరిరక్షించడానికి దృఢ చిత్తంతో వ్యవహరిస్తామని క్వాడ్‌ దేశాల అగ్రనేతలు ప్రతినబూనారు. జపాన్‌లోని టోక్యోలో జరిగిన క్వాడ్‌ శిఖరాగ్ర సమావేశం  ముగింపు సందర్భంగా నాలుగు దేశాల అగ్ర నేతలు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. బలవంతంగా యథాతథ స్థితిని మార్చడానికి ఎవరు ప్రయత్నించినా సహించబోమని కూడా ఈ ప్రకటనలో క్వాడ్‌ నేతలు హెచ్చరిక జారీ చేశారు.  ఈ హెచ్చరికను చైనాను ఉద్దేశించినదేనని స్పష్టమవుతున్నది. అయితే సంయుక్త ప్రకటనలో ఎక్కడా చైనా పేరును ప్రస్తావించలేదు.  తూర్పు, దక్షిణ చైనా సముద్ర జలలో ఎదురవుతున్న సవాళ్లను ఈ ప్రకటన అధికంగా ప్రస్తావించింది. ఈ ప్రాంతంలోని అనేక దేశాల మధ్య సరిహద్దు వివాదాలున్నాయని పేర్కొన్నది. సౌత్‌ చైనా సముద్రం మొత్తం తనదేనని చైనా చెప్పుకుంటున్నది. ఈ ప్రాంతంలోని అనేక దీవులను చైనా తన సైనిక స్థావరాలుగా మార్చుకుంటున్నది. వందలాది పడవలతో కూడిన మారిటైమ్‌ మిలిషియాను తయారుచేస్తున్నది. ‘యథాతథ స్థితిని దెబ్బతీసేవిధంగా,…

Read More

కోనసీమకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టడం పట్ల జిల్లాలో పెల్లుబికిన వ్యతిరేకత మంగళవారం హింసాయుత రూపం తీసుకొంది. నిరసనలు అదుపుతప్పి స్థానిక మంత్రి విశ్వరూప్ ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. అమలాపురంలో ముమ్మిడివరం ఎమ్యెల్యే పొన్నాడ సతీష్ ఇంటికి నిప్పు పెట్టారు. జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి వాహనంపై రాళ్ళ దాడి జరిపారు.  పలు ప్రైవేట్ కాలేజీ బస్సు లను దగ్ధం చేయగా, అల్లరిలో 20 మంది పోలీసులు గాయపడిన్నట్లు హోమ్ మంత్రి తానేటి అనిత తెలిపారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. బాష్పవాయువు ప్రయోగించారు.  పేరు పెట్టాలని ఓ వైపు.. వద్దంటూ మరోవైపు రెండు వర్గాలు సాగిస్తున్న పోటాపోటీ సమరం ఒక్కసారిగా భగ్గుమంది. ఇప్పటికే జిల్లాలో పోలీసు ఆంక్షలు కొనసాగుతున్న క్రమంలో వారంరోజుల పాటు 144సెక్షన్‌ విధిస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పోలీసు ఆంక్షలు సైతం కాదని కదం తొక్కిన నిరసన కారులు హింసబాట పట్టారు.  జిల్లాల…

Read More

ఉదయపూర్ లో జరిగిన కాంగ్రెస్ చింతన్ సివిర్ అనంతరం 2024 ఎన్నికలు లక్ష్యంగా మూడు కీలక కమిటీలను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించారు. ఈ కమిటీలలో `జి-23′ గా పేరొందిన అసమ్మతి బృందం నాయకులకు కూడా స్థానం కల్పించడం గమనార్హం.  రాజకీయ వ్యవహారాల బృందం, టాస్క్ ఫోర్స్-2024  ‘భారత్ జోడో యాత్ర’ను సమన్వయం చేయడానికి సెంట్రల్ ప్లానింగ్ గ్రూప్‌ను పార్టీ ప్రకటించింది.  ఉదయపూర్ లో ప్రియాంక గాంధీని పార్టీ అధ్యక్షురాలిగా చేయాలని వాదనలు వినిపించిన నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్ లో ఆమెకు స్థానం కల్పించి, రాహుల్ గాంధీకి కల్పించలేదు.  ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు చెందిన బృందంలో గతంలో పనిచేసిన సునీల్ కనుగోలుకు కూడా ఆమెతో పాటు ఈ బృందంలో స్థానం కల్పించారు.  అయితే సోనియాకు సలహాలు అందించే రాజకీయ వ్యవహారాల కమిటీలో రాహుల్ ఉన్నారు. ఆయనతో పాటు ఈ కమిటీలో గులాబీ నబి ఆజాద్ కూడా ఉన్నారు. ఈ బృందంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, గులాం నబీ ఆజాద్,…

Read More

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై హత్యాయత్నం జరిగిందని, ఈ హత్యాయత్నం నుంచి ఆయన తప్పించుకున్నారని ఉక్రెయిన్ సైనికాధికారి ఒకరు వెల్లడించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఈ ఏడాది ఫిబ్రవరి24న యుద్ధం మొదలైన తర్వాత ఈ సంఘటన జరిగినట్లు ఆయన చెప్పారు.  పుతిన్ ఆరోగ్యంపై వదంతులు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ విషయం వెలుగుచూడడం గమనార్హం. నల్ల సముద్రం, కాస్పియన్ సముద్రం మధ్య ఉన్న కాకసస్ ప్రాంతంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై విఫల హతాయత్నం జరిగినట్లు ఉక్రెయిన్ రక్షణ నిఘా విభాగం చీఫ్ మేజర్ జనరల్ కిరిలో బుడనోవ్ ఉక్రెయిన్‌స్కా ప్రావ్డా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.  పుతిన్‌ను హతమార్చడానికి ప్రయత్నం జరిగిందని, ఆయనపై దాడి కూడా జరిగిందని కాకసస్ ప్రతినిధులు చెప్పారని బుడనోవ్ తెలిపారు. ఈ హత్యాయత్నంపై బహిరంగ సమాచారం లేదని, ఇది కచ్ఛితంగా విఫల హత్యాయత్నమని, సుమారు రెండు నెలల క్రితం ఇది జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఇలా ఉండగా, …

Read More