Author: Editor's Desk, Tattva News

ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్కు పాకిస్థాన్ కోర్టు 31 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రెండు కేసులకు సంబంధించి విచారణ ముగించిన ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. జైలు శిక్షతో పాటు రూ.3,40,000 జరిమానా విధించింది. పాక్ కోర్టు ఆదేశాల మేరకు హఫీజ్ సయీద్ అక్రమంగా నిర్మించిన మసీదు, మదర్సాను సీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ పోలీస్ కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ నమోదు చేసిన రెండు ఎఫ్ఐఆర్లపై ఉగ్రవాద వ్యతిరేక కోర్టు న్యాయమూర్తి ఇజాజ్ అహ్మద్ భుట్టర్ ఈ తాజా తీర్పు ఇచ్చారు. 2019 నుంచి భారీ భద్రత మధ్య సయూద్‌ను ఉంచిన లాహోర్‌లోని లఖ్‌పట్ జైలు నుంచి ఆయనను కోర్టు ముందు హాజరుపరిచారు. ఆయనపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్‌లలో మొదటి కేసులో 15.5 సంవత్సరాలు, రెండో కేసులో 16.5 సంవత్సరాలు కోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది…

Read More

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన పై  రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. విభజన వ్యవహారంలో నియమ నిబంధనలపై  ఉండవల్లి గతంలోనే పిటిషన్ దాఖలు చేశారు.  సామరస్య విభజనకు నిబంధనలు రూపొందించేలా కేంద్రానికి సూచనలు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సమయంలో కొన్ని తప్పులు జరిగాయని, విభజన ప్రక్రియ సరిగా జరగలేదని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  భవిష్యత్తులో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ మళ్లీ సవరణ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పునర్విభజన నిబంధనల విషయాన్ని చీఫ్ జస్టిస్  ఎన్వీ రమణ ధర్మాసనం ముందు ప్రస్తావించారు.  ఈ పిటిషన్ దాఖలు చేసి ఇప్పటికే చాలా కాలం అయిందని న్యాయవాది  ప్రశాంతభూషణ్ గుర్తు చేశారు. ఆయన సూచనను పరిగణనలోకి తీసుకున్న చీఫ్ జస్టిస్ ధర్మాసనం దీనిపై త్వరితగతిన విచారణకు జరిపేందుకు అంగీకరించింది. త్వరగా విచారణ జరిపేందుకు…

Read More

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ, హర్యానా, ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర, మిజోరాంలలో గత వారం రోజులుగా కేసులు పెరుగుతున్నాయని కేంద్రం తెలిపింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కావాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాకేష్‌ భూషణ్‌ శుక్రవారం హెచ్చరించారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల అధికారులకు లేఖ రాశారు. దేశంలో గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ వెయ్యి కంటే తక్కువ కొత్త కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. రాష్ట్రాలు ఆర్థిక, సామాజిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తున్నందున, కోవిడ్‌ -19 నిర్వహణ కోసం రిస్క్‌ అసెస్‌మెంట్‌-ఆధారిత విధానాన్ని నిరంతరం అనుసరించాల్సిన అవసరం ఉందని భూషణ్‌ రాష్ట్రాలను కోరారు.  హర్యానా మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం ఏప్రిల్‌ 1తో ముగిసిన వారంలో 367 కొత్త కేసులు నమోదు కాగా, ఏప్రిల్‌ 8తో ముగిసిన వారంలో 416కి పెరిగింది, ఇది భారతదేశంలోని కొత్త కేసులలో 5.70 శాతంగా ఉంది. గత వారంలో రాష్ట్రంలో కోవివ్‌ కేసుల పాజిటివిటీ…

Read More

అమెరికాలో హెచ్ 4 వీసాదార్లు ఉద్యోగాలు చేసుకునే స్వతహసిద్ధ హక్కు పొందేందుకు మార్గం ఏర్పడింది. సంబంధిత బిల్లును చట్టసభలోని ఇద్దరు అమెరికా మహిళా సభ్యులు ప్రవేశపెట్టారు. ప్రతినిధుల సభలో ఈ బిల్లు ఆమోదానికి తీసుకురావడంతో హెచ్ 4 వీసాదార్లలో ఆశలు రేకెత్తాయి. దేశంలో తీవ్రస్థాయిలో ఉన్న ఉద్యోగ కొరతను తీర్చేందుకు ఈ బిల్లు ఆమోదం తప్పనిసరి అని ప్రతినిధుల సభ సభ్యురాళ్లు తెలిపారు. ఉద్యోగ కార్మిక కొరతతో అమెరికా వ్యాపార వర్గాలు, ప్రముఖ సంస్థలకు ఉత్పత్తి లేదా నిర్వహణపరమైన చిక్కులు ఏర్పడుతున్నాయి. వీటిని అధిగమించేందుకు వెంటనే హెచ్ 4 వీసాదార్లకు ఉద్యోగ అవకాశాలను కల్పించాల్సి ఉంది. దీనిని హక్కుగా నిర్థారించాల్సి ఉంది. దీనితో వలసపై వచ్చిన కుటుంబాలు కలిసి ఉండేందుకు మార్గం ఏర్పడుతుందని ప్రజా ప్రతినిధులు ఆశాభావం వ్యక్తంచేశారు. ఇప్పటి వరకూ ఉన్న ఉద్యోగ నిబంధనల మేరకు హెచ్ 1 బి, హెచ్2ఎ, హెచ్ 2 బి, హెచ్ 3 వీసాదార్ల వెంబడి…

Read More

ప్రపంచంలోనే ఎల్‌పిజి గ్యాస్‌ ధర భారత్‌లోనే అత్యధికంగా ఉంది. ఆయా దేశాల ప్రజల కొనుగోలు శక్తి సమానత్వం (పర్చేజింగ్‌ పవర్‌ పారటి – పిపిపి)తో విశ్లేషిస్తే లీటర్‌ గ్యాస్‌ ధర ఇక్కడే అధికం. ప్రపంచ దేశాల్లోనూ అధిక పెట్రోలియం ధరల్లోనూ భారత్‌ మూడో స్థానంలో ఉంది. హెచ్చు డీజిల్‌ ధరల్లో ఎనిమిదో దేశంగా ఉంది. . దేశాల వారిగా ప్రత్యేకమైన కరెన్సీలు ఉండగా, ఆయా మార్కెట్లలో కొనుగోలు శక్తి భిన్నంగా ఉంది. ఆదే విధంగా ఆదాయ స్థాయిల్లో తీవ్ర అంతరాలు ఉన్నాయి. పశ్చిమ దేశాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర వారి రోజువారి ఆదాయాల్లో అత్యల్ప విలువ చేస్తుంది. సగటు భారతీయుడి రోజువారి ఆదాయంలో నాలుగో వంతుగా ఉంది. ఇక బురుండి దేశంలో రోజు వారి ఆదాయం కంటే పెట్రోల్‌ ధరనే ఎక్కువగా ఉంది. భారత్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.120గా ఉంది. దీన్ని అమెరికా కరెన్సీతో పోల్చితే 1.58 డాలర్లుగా ఉంటుంది. వాస్తవంగా భారత్‌తో పోల్చితే…

Read More

దేశంలో ఒమిక్రాన్‌ ఎక్స్‌ఈ వేరియంట్‌ వ్యాప్తి చెందిన నేపథ్యంలో.. 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి బూస్టర్‌ డోసు వేసేందుకు కేంద్రం నిర్ణయించింది. ఆదివారం నుంచి అర్హులైన వారందరికీ ఈ డోసు వేయనున్నట్టు ప్రకటించింది. ఒమిక్రాన్‌ ఎక్స్‌ఈ వేరియంట్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది.  ఈ వేరియంట్‌ వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు అప్రమత్తం అయ్యారు. అయితే ప్రికాషన్‌ డోసు పేరుతో 18 ఏళ్లు పైబడిన వారికి ఇచ్చే ఈ వ్యాక్సిన్‌.. ప్రైవేటు కేంద్రాల్లోనే అందుబాటులో ఉంటుందని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ  ప్రకటించింది.  దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఎంతో వేగంగా ముందుకు వెళ్తున్నదని వివరించింది. రెండో డోసు తీసుకుని 9 నెలలు పూర్తయితే.. ఈ బూస్టర్‌ డోసుకు అర్హులని, అదేవిధంగా 18 ఏళ్లు నిండి ఉండాలని సూచించింది. ప్రభుత్వ టీకా కేంద్రాల్లో ప్రస్తుతం తొలి, రెండు డోసుల పంపిణీ కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేసింది.  ఆరోగ్య…

Read More

రాష్ట్ర ప్రభుత్వం తనను తరచూ అవమానాలకు గురిచేస్తున్నదని , ప్రోటోకాల్ పాటించడం లేదని ఢిల్లీ వెళ్లి తీవ్రమైన ఆరోపణలు చేసి, ప్రధాని, కేంద్ర హోమ్ మంత్రిలకు ఫిర్యాదు చేసిన గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ పట్ల రాష్ట్ర మంత్రి కెటి రామారావు తీవ్రంగా స్పందించారు.  గవర్నర్ తో తమకు ఎలాంటి పంచాయతీ లేదంటూనే గవర్నర్.. గవర్నర్‌గా వ్యవహరిస్తే తప్పకుండా గౌరవిస్తాం. గవర్నర్ వ్యవస్థతో మాకెందుకు పంచాయితీ ఉంటుంది?’ అంటూ నర్మగర్భంగా వాఖ్యలు చేశారు.  సిరిసిల్ల కలెక్టరేట్‌లో మీడియాతో  ఇష్టాగోష్టిగా మాట్లాడిన మంత్రి కేటీఆర్ తాము  ఎక్కడ కూడా గవర్నర్ పదవికి భంగం కలిగే విధంగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు.  గవర్నర్ అలా ఎందుకు ఊహించుకుంటున్నారో? ఎందుకు స్పందిస్తున్నారో? అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. ‘గవర్నర్‌కు ఎక్కడ అవమానం జరిగింది? ఎవరు ఎవర్నీ అవమానించారు?’ అంటూ ఎదురు ప్రశ్న వేశారు. కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో అభ్యంతర పెట్టినందుకు అవమానిస్తారా .? అని గవర్నర్ చెప్పినట్లు విన్నానని పేర్కొంటూ కౌశిక్‌రెడ్డి ఎంఎల్‌సి అయ్యేందుకు…

Read More

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల, ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా?  రాష్ట్ర గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన సందర్భంగా వీరిద్దరిని కలసి గవర్నర్ పట్ల అమర్ధ్యకారంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని, ప్రోటోకాల్ పాటించడం లేదని తెలపడంతో పాటు పరిపాలన వ్యవహారాలపై కూడా ఫిర్యాదు చేసిన్నట్లు తెలుస్తున్నది.  ముఖ్యంగా రాష్ట్రంలో డ్రగ్స్ కల్చర్ పెచ్చుమీరుతుండడంపై వారికి వివరించారని చెబుతున్నారు. గత అదివారం రాడిసన్ బ్లూ పబ్ లో దొరొకిన  డ్రగ్స్ గురించి గవర్నర్ కేంద్రం దృష్టికి తీసుకువెళ్లిన్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై వస్తున్న పలు అవినీతి ఆరోపణలపై కూడా ఆమె ఓ ప్రత్యేక నివేదిక ఇచ్చిన్నట్లు తెలుస్తున్నది. ఆమె ఫిర్యాదులపై కేంద్రం సీరియస్ అయిన్నట్లు స్పష్టం అవుతున్నది.  ముఖ్యంగా గవర్నర్ ను అవమానించడం తనను అవమానించినట్లు అమిత్ షా వ్యాఖ్యానించినట్లు వెలువడిన వార్తా…

Read More

ఆంధ్ర ప్రదేశ్ లో ఒక వంక జనసేనతో పొత్తు కొనసాగిస్తున్న బిజెపి ఆ పార్టీకి చెందిన మాజీ సీనియర్ నేత ఒకరిని తమ పార్టీలో చేర్చుకొంది. జగన్ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడాలని గత నెలలో పిలుపు ఇవ్వడం ద్వారా జనసేన, టిడిపి, బిజెపి ఉమ్మడిగా పోటీచేయాలని పరోక్షంగా పవన్ కళ్యాణ్ సంకేతం ఇచ్చినప్పటి నుండి రాష్ట్ర బిజెపి నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.  తమకు కేవలం జనసేనతో మాత్రమే పొత్తు అని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. అవసరమైతే ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్దమనడం ద్వారా జనసేన టిడిపితో కలిస్తే తమ దారి తాము చూసుకొంటామనే స్పష్టమైన సంకేతం ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజా చేరిక ప్రాధాన్యత సంతరింప చేసుకొంది. ఒక విధంగా పవన్ కళ్యాణ్ కు పరోక్షంగా హెచ్చరికగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.  జనసేన మాజీ సీనియర్ నాయకుడు మారిశెట్టి రాఘవయ్య బిజెపిలో చేరారు.  శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. …

Read More

 సుప్రీం కోర్టులో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అవిశ్వాస తీర్మానం విషయంలో డిప్యూటీ స్పీకర్ ఖాసీం సూరీ తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయమని, రాజ్యాంగ వ్యతిరేకం అని  సుప్రీం స్పష్టం చేసింది.  అవిశ్వాసంపై మళ్లీ ఓటింగ్‌ నిర్వహించాలని, జాతీయ అసెంబ్లీని పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పాక్‌ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై శనివారం ఓటింగ్‌ జరగనుంది. ఇమ్రాన్‌పై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని తోసిపుచ్చడం సరికాదని కోర్టు పేర్కొంది. ఇమ్రాన్ సర్కార్‌పై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడం, జాతీయ అసెంబ్లీ రద్దు వంటి అంశాలపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. పాకిస్తాన్‌ చీఫ్‌ జస్టిస్‌ ఉమర్‌ అట బండియల్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం ముందు అటార్నీ జనరల్‌ ఖలీద్‌ జావెద్‌ ఖాన్‌ వాదనలు వినిపించారు. పార్లమెంటు అంతర్గత వ్యవహారాల్లో న్యాయస్థాన జోక్యం సరికాదని, స్పీకర్‌ నిర్ణయాలను సవాల్‌ చేసే అధికారం కోర్టులకు లేవని పాక్‌ ప్రధాని తరపు న్యాయవాది…

Read More