Author: Editor's Desk, Tattva News

మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలంటూ పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ కోరినట్లు చేయడం అసాధ్యం అంటూ పాకిస్థాన్ ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. దానితో జాతీయ అసెంబ్లీని రద్దు చేయించి, 90 రోజులలో ఎన్నికలు జరిపించి, తిరిగి అధికారంలోకి రావాలని ఇమ్రాన్ వేసుకున్న ఎత్తుగడ తలకిందులయ్యే పరిస్థితులు ఎదురవుతున్నాయి.   న్యాయపరమైన, రాజ్యాంగపరమైన, లాజిస్టికల్‌ సవాళ్ల  కారణంగా  ఈ ఎన్నికలను మూడు నెలల్లోగా నిర్వహించడం సాధ్యం కాదని కమీషన్ తేల్చి చెప్పింది.ఎన్నికల నిర్వహణకు  కనీసం ఆరు నెలల సమయం పడుతుందని స్పష్టం చేసింది.  నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, ముఖ్యంగా కైబర్‌ పక్తూంక్వాలో నియోజకవర్గాలు పెరగబోతుండటం, ల్లా, నియోజకవర్గాలవారీగా ఓటర్ల జాబితాలను తయారు చేయడం వంటి ప్రధాన సవాళ్ల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు  సుమారు ఆరు నెలల సమయం అవసరమని తెలిపింది.  నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియకు చాలా సమయం పడుతుందని, చట్ట ప్రకారం అభ్యంతరాలను తెలపడానికి ఒక నెల సమయం ఇవ్వాలని కమీషన్ అధికారి ఒకరు చెప్పారు. ఎన్నికల చట్టంలోని…

Read More

మూడు రోజుల పాటు భారత దేశంలో పర్యటించిన నేపాల్ ప్రధాన మంత్రి షేర్ బహదూర్ దేవుబా సంప్రదాయాలను పక్కన పెట్టి తన పర్యటన ప్రారంభంలోనే  ఢిల్లీలోని  బిజెపి  ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడం రాజకీయ వర్గాలలో విస్మయం కలిగిస్తున్నది.  ఈ విషయమై దేవుబా స్వదేశంలో విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.  ఆయన నేతృత్వం వహిస్తున్న నేపాల్ కాంగ్రెస్ కు భారత దేశంలోని కాంగ్రెస్ పార్టీతో, వివిధ రకాల సోషలిస్ట్ పార్టీలతో మొదటి నుండి మంచి సంబంధాలు ఉంటూ వచ్చాయి. పలు సందర్భాలలో నేపాల్ లో జరిగిన ఆ పార్టీ కార్యక్రమాలలో ఈ పార్టీల ప్రతినిధులు పాల్గొనడమే కాకుండా, నేపాల్ కాంగ్రెస్ జరిపిన పలు పోరాటాలను సంఘీభావం కూడా ప్రకటించారు.  అయితే బిజెపికి, ఆ పార్టీ నాయకులకు నేపాల్ కాంగ్రెస్ తో చెప్పుకోదగిన సంబంధాలు పార్టీ పరంగా లేవు. అందుకనే మొదటిసారిగా బీజేపీకి కార్యాలయంను ఆ పార్టీ అధినేత ఒకరు సందర్శించడం ప్రాధాన్యత కలిగిస్తున్నది. దౌత్యపరమైన వ్యూహాలతో భాగంగా రెండు దేశాల అధినేతల ప్రయత్నాలలో భాగం…

Read More

డ్రక్స్ కల్చర్ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల‌దేన‌ని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు.  రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాడిసన్ పబ్ ఘటనలో రెండు జాతీయ పార్టీల నేతల పిల్లలే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.   డ్రగ్స్ వాడుతూ పబ్ లో దొరికిన వారిలో ఒకరేమో బీజేపీ ప్రముఖ నాయకురాలి కుమారుడని, మరొకరు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మేనల్లుడిని వివరించారు. ఇంకా కొంతమంది నాయకుల పిల్లలు ఉన్నట్లు తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. పబ్‌ ఓనర్‌ అభిషేక్‌ బీజేపీ నేత ఉప్పల శారద కొడుకని తెలిపారు. ఆమె 2018 ఎన్నికలలో బిజెపి అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీచేశారు.  ఈ ఘటనతో బీజేపీ, కాంగ్రెస్‌ నేతల చిల్లర వ్యవహారాలు బయటపడుతున్నాయని ధ్వజమెత్తారు. డ్రగ్స్‌ అమ్మేది బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతల సన్నిహితులేనని, కేసు దర్యాప్తు పూర్తయితే మరిన్ని పేర్లు, కీలకమైన విషయాలు  బయటకు వస్తాయని పేర్కొన్నారు.  కాంగ్రెస్ బీజేపీ నాయకుల కుటుంబ సభ్యులు డ్రగ్స్ కు అలవాటు…

Read More

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి హైకోర్టుకు బే షరతుగా లిఖితపూర్వక క్షమాపణ తెలిపారు. దీంతో ఆయనపై కోర్టు ధిక్కరణ కేసు విచారణను హైకోర్టు ముగించింది. ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి సిద్ధిపేట కలెక్టర్ గా ఉన్న సమయంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. సిద్దిపేట కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి హాజరైన సీఎం కేసీఆర్ కు వెంకట్రామిరెడ్డి పాదాభివందనం చేయడం దుమారం రేపింది. ఆయన ఏకపక్షంగా, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలకు ఈ ఘటనే ముఖ్య నిదర్శనమని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ఐఏఎస్ స్థాయిలో ఉంటూ ఇలా వ్యవహరించడం సరికాదన్న కామెంట్స్ పరిణామాలపై వెంకట్రామిరెడ్డి స్పందించి సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అయితే ఏం జరిగిందో కానీ కొద్ది రోజులకే టీఆర్ఎస్ పార్టీలో చేరి.. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వెంకట్రామిరెడ్డి సిద్దిపేట కలెక్టర్ గా ఉన్న సమయంలో వరి సాగు చేపట్టొద్దంటూ వ్యాపారులెవరూ వరి విత్తనాలు కూడా అమ్మొద్దంటూ మౌఖిక ఆదేశాలిచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు కోర్టు నుండి ఆదేశాలు తెచ్చుకున్న పట్టించుకోమన్నారనే ఆరోపణలు రావడంతో కోర్టు ధిక్కరణ…

Read More

గత కొన్ని సంవత్సరాలుగా మరుగున పడిపోయిన మహిళా రిజర్వేషన్‌ బిల్లును ముందుకు తెచ్చేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. ఈ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతివ్వాలని కోరుతోంది.  సోమవారం లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఎగువసభలో ప్రవేశపెట్టేందుకు నోటీసు ఇచ్చామని టిఎంసి రాజ్యసభ సభ్యుడు డెరెక్‌ ఓబ్రియన్‌ తెలిపారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే డిమాండ్ ఏనాటి నుంచో ఉంది. అయితే బిల్లు రూపం నుంచి చట్ట రూపం దాల్చడం లేదు. అప్పుడప్పుడు ఈ విషయమై రాజకీయ చర్చ జరుగుతుంది. కొద్ది రోజుల క్రితం మహిళా దినోత్సవం సందర్భంగా పార్లమెంట్‌లోనూ చర్చ జరిగింది. కానీ చర్చ చట్టాన్ని చేరడం లేదు.   ప్రజా ప్రయోజన సమస్యల్ని లేవనెత్తే అవకాశమున్న రూల్‌ 168 కింద  ఓబ్రియన్‌  ఈ నోటీసు ఇచ్చారు. ఈ బిల్లును ఏప్రిల్‌ 8న రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నామని, దీనికి అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించి, ఓటు…

Read More

అమెరికా, యూరప్ వంటి ఇతర దేశాల్లో వినియోగిస్తున్న టీకాల కన్నా మన దేశంలో మన టీకాలు చాలా ఉత్తమమైనవని రుజువైందని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఇఒ అధర్ పూనావాలా వెల్లడించారు. ఆయా దేశాల్లో చాలా ఎక్కువగా కేసులు పెరుగుతుండగా, మనదేశంలో చాలా తక్కువగా కేసులు ఉంటున్నాయని, దీనికి కారణం సరైన టీకాలను మనం ఎంచుకోవడమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ ఇంధనం అనే అంశంపై సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు తక్కువగా ఉండడానికి సరైన టీకాను ఎంచుకోవడమే కారణమని చెప్పారు. ఒకవేళ నాలుగో వేవ్ సంభవిస్తే అది చాలా మాంద్యంగా ఉంటుందని తెలిపారు. బూస్టర్ డోసు గురించి మాట్లాడుతూ ఎవరైతే విదేశాలకు పర్యటిస్తారో వారికి బూస్టర్ డోసు తప్పనిసరి అని, అందువల్ల ప్రతివారికి బూస్టర్ డోసు ఇవ్వడానికి అనుమతించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని చెప్పారు. దీనిపై ప్రభుత్వం అంతర్గతంగా చర్చిస్తోందని పేర్కొంటూ త్వరలో…

Read More

రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ప్రతిపక్షాలు, విపక్షాలు పార్లమెంటును స్తంభింపజేస్తున్నాయి. ధరలపై చర్చ నడపాలని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిరసనలతో సభా కార్యక్రమాల్ని అడ్డుకున్నాయి.  సోమవారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై చర్చించాలని రాజ్యసభలో విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో ప్రతిపక్ష నేతలకు మాట్లాడే అవకాశమిస్తామని డిప్యూటీ ఛైర్మన్‌ సస్మిత్‌ పాత్ర చెప్పినా  వినకుండా విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేయడంతో  ఆయన సభను 2 గంటల వరకు వాయిదా వేశారు..  వెల్‌లోకి దూసుకెళ్లిన విప‌క్ష స‌భ్యులు నినాదాలతో హోరెత్తించారు. దీంతో రెండు సార్లు రాజ్య‌స‌భ‌ వాయిదా పడింది. అయినప్పటికీ సభ అదుపులోకి రావకపోవడంతో మంగళవారానికి వాయిదా పడింది. అంతకు ముందు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లపై రూల్ 267 కింద చ‌ర్చ చేప‌ట్టాల‌ని విప‌క్షాలు ఇచ్చిన తీర్మానాన్ని రాజ్యసభ చైర్మెన్ వెంక‌య్య నాయుడు తిర‌స్క‌రించారు.  కాగా, పెట్రో అంశంపై లోక్‌స‌భ‌లోనూ విప‌క్షాలు ఆందోళ‌న చేప‌ట్టాయి. వెల్‌లోకి దూసుకువెళ్లిన డీఎంకే స‌భ్యులు…

Read More

శ్రీలంక లాంటి పరిస్థితి, ఆర్థిక సంక్షోభం భారత్‌లో కూడా రావచ్చని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా కేంద్రం వద్ద తగినంత డబ్బులు లేవని ఆయన విమర్శించారు. రెండేళ్లలో ఎఫ్‌సీఐకి రూ.4.27 లక్షల మేర సబ్సిడీ బకాయిలను కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని తెలిపారు.  ఈ పరిస్థితి కేవలం రెండేళ్లకు సంబంధించినదని చెబుతూ కేంద్రం వద్ద నిధులు లేవని, ఈ ప్రభుత్వం దివాళా తీసిందని  రామ్ గోపాల్ యాదవ్ ఆరోపించారు.  ‘శ్రీలంక తీవర్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. మన దేశ పరిస్థితి కూడా అటుఇటుగా అలాగే ఉంది. కాకపోతే శ్రీలంక బయటికి కనిపిస్తోంది. భారత్ అంతలా బహిరంగం కాలేదు. నిజానికి ప్రభుత్వం వద్ద సరిపడా నిధులు లేవు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సరిగా జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది’ అని ఆయన తెలిపారు.  కేంద్ర ఉన్నతాధికారుల ఆందోళన ఇలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వాలు…

Read More

వాణిజ్య రాజధాని షాంఘైలో కరోనా విలయ తాండవం చేస్తోంది. చైనాలో మొత్తం నమోదవుతున్న కేసుల్లో దాదాపు 70 శాతం ఈ ఒక్క నగరం లోనే బయటపడుతున్నాయి. దీంతో షాంఘైలో వైరస్ కట్టడికి చర్యలను చైనా ప్రభుత్వం చేపట్టింది. పరీక్షలను పెంచడంతోపాటు పెద్ద ఎత్తున ఆరోగ్య కార్యకర్తలు, సైన్యాన్ని నగరానికి ప్రభుత్వం పంపింది. సోమవారం దేశ వ్యాప్తంగా 18 వేలకు పైగా కొత్త కేసులు నమోదవ్వగా, దాదాపు 9 వేల కేసులు ఒక్క షాంఘై లోనే ఉండటం గమనార్హం. ఈ నగరంలో గత వారం లాక్‌డౌన్ విధించారు. సోమవారం నుంచి ట్విన్ కొవిడ్ పరీక్షలు మొదలు పెట్టారు. అంటే ప్రతి పౌరుడికి యాంటీజెన్, న్యూక్లిక్ యాసిడ్ పరీక్షలు చేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం సైన్యాన్ని రంగం లోకి దింపింది. ఆర్మీ, నేవీ నుంచి దాదాపు 2 వేల మందికి పైగా సిబ్బందిని నగరానికి పంపింది. దీంతోపాటు దాదాపు 15 వేల మంది ఆరోగ్య కార్యకర్తలు…

Read More

హనుమంతుడి జన్మస్థలం గురించి తిరుమల తిరుపతి దేవస్థానంలోని పండితులు, కర్ణాటకలోని పండితుల మధ్య కొద్దికాలంగా కొనసాగుతున్న వివాదంలో మొదటిసారిగా ఒక రాజకీయ నాయకుడు ప్రవేశించారు. హనుమంతుడి జన్మస్థలం కర్ణాటక అంటూ బిజెపి ఎంపీ తేజస్వి సూర్య చేసిన ప్రకటన మరో రాజకీయ దుమారం రేపే అవకాశం ఉంది.  కర్ణాటకలోని అంజనాద్రి కొండ హనుమంతుడి జన్మస్థలమనితేజస్వీ సూర్య స్పష్టం చేసారు. బెంగళూరు సౌత్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్య బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారత్ దర్శన్ యాత్రలో భాగంగా అంజనాద్రి ఆలయాన్ని సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. కర్ణాటకలోని విజయనగరం జిల్లా అనెగొండి సమీపంలోని అంజనాద్రి కొండ హనుమంతుని జన్మస్థలం అనే విషయంలో తనకు ఎలాంటి సందేహం లేదని సూర్య స్పష్టం చేశారు. హనుమంతుడి జన్మస్థలంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.  “ఇతరులు దీనిపై వేరే వాదనలు చేసినా పర్వాలేదు.. మన కిష్కింద…

Read More