హిజాబ్ ధరించడం మతపరంగా తప్పనిసరికాదని కర్నాటక హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. హిజాబ్ వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు మంగళవారం తుదితీర్పు వెలువరించింది. విద్యా సంస్థల్లో సాంప్రదాయ వస్త్రధారణపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కోర్టు సమర్థించింది. ఈ అంశంపై దాఖలయిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. విద్యాసంస్థల ప్రొటోకాల్‌ను విద్యార్థులంతా తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. గత నెల కర్నాటకలో విద్యాసంస్థల్లో హిజాబ్ వస్త్రధారణపై వివాదం రేగింది. ఉద్రిక్తతల నడుమ హిజాబ్‌కు మద్దతుగాను, వ్యతిరేకంగానూ పలు చోట్ల నిరసనలు జరిగాయి. ఈ క్రమంలో హిజాబ్ వస్త్రధారణకు అనుమతినివ్వాలని కోరుతూ.. ఉడుపి, కుందాపుర ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు హైకోర్టును ఆశ్రయించారు. కర్ణాటక నుంచి మొదలై దేశవ్యాప్తంగా ఆ మాటకొస్తే ప్రపంచంలోనూ హాట్ టాపిక్‌గా మారింది హిజాబ్ వ్యవహారం. విద్యాసంస్థల్లో హిజాబ్‌ను అనుమతించలేదు కర్ణాటక ప్రభుత్వం. ఈ అభ్యంతరాలపై దాఖలైన పిటిషన్లపై వాదనలు విన్న కర్ణాటక హైకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ…
Author: Editor's Desk, Tattva News
అంతర్జాతీయస్థాయి కబడ్డీ క్రీడాకారుడు సందీప్ సింగ్ (40) ను దుండగులు తుపాకులతో కాల్చి చంపిన ఘటన పంజాబ్‌లోని జలందర్ జిల్లాలో చోటుచేసుకుంది. మలియన్ ఖుర్ద్ గ్రామంలో కబడ్డీ టోర్నమెంట్ జరుగుతుండగా అక్కడి నుంచి పక్కకు వచ్చిన సందీప్‌ను నలుగురు తుపాకులతో కాల్చిచంపారు. వెంటనే సందీప్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లగా అతడు అప్పటికే చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించారు. సందీప్ తల, ఛాతీ భాగంలో 8 నుంచి 10 బుల్లెట్లు దూసుకుపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. జలంధర్ డిఎస్‌పి లక్విందర్ సింగ్ మాట్లాడుతూ జలందర్‌లోని షాకోట్ సమీపంలో నంగల్ అంబియన్ గ్రామానికి చెందిన భారత జట్టు మాజీ కెప్టెన్ సందీప్ సింగ్ ఇంగ్లాండ్‌లో స్థిరపడ్డారని తెలిపారు. అతనికి ఆ దేశ పౌరసత్వం ఉందని చెప్పారు. తరచుగా ఆయన కబడ్డీ టోర్నమెంట్‌లు నిర్వహిస్తాడని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకొని…
రాష్ట్ర ప్రయోజనాల రీత్యా వైసీపీ వ్యతిరేక ఓటును చీలకుండా చూస్తామని ప్రకటించనని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలలో టిడిపి, బిజెపి లతో కలసి కూటమి ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమైన సంకేతం ఇచ్చారు. ప్రభుత్వం బిజెపితో నెలకొన్న పొత్తును ప్రస్తావిస్తూ రాష్ట్ర బాధ్యతను జనసేన తీసుకుంటుందని వెల్లడించారు. ఈ దిశగా బీజేపీ నాయకులు రోడ్‌మ్యాప్ ఇస్తామని చెప్పారని, దానికోసం ఎదురు చూస్తానని చెప్పారు. రోడ్ మ్యాప్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని, వైసీపీని గద్దె దించుతామని ఆయన స్పష్టం చేయడం ద్వారా టిడిపితో కలసి కూటమి ఏర్పాటుకు కలసి రావడమో, లేకపోవడమే బిజెపికి వదిలివేస్తున్నట్లు పరోక్షంగా చెప్పిన్నట్లయింది. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం తాడేపల్లి మండలం ఇప్పటం నిర్వహించిన బహిరంభారీ గ సభలో ఆయన మాట్లాడుతూ ‘2024లో అధికారంలోకి వస్తాం. సుపరిపాలన ఇచ్చే కొత్త ప్రభుత్వాన్ని స్థాపిస్తాం’ అంటూ భరోసా వ్యక్తం చేశారు. ‘వైసిపిది విధ్వంసం. మనది వికాసం. వారిది ఆధిపత్యం. జనసేనది ఆత్మగౌరవం. అది అహంకారానికి…
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యవెనుక ‘రాజకీయ పెద్దల’ హస్తం ఉందని సీబీఐ ఆరోపించింది. హత్య కేసులో ఏ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, అతని అనుచరులు సాక్షులను బెదిరిస్తున్నారని సీబీఐ తరఫు న్యాయవాది ఎ.చెన్నకేశవులు హైకోర్టులో వాదనలు వినిపించారు. సీఆర్‌పీసీ 164 కింద మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు దర్యాప్తు అధికారి ముందు అంగీకరించిన సీఐ శంకరయ్య, గంగాధర్‌రెడ్డి, కృష్ణారెడ్డి తరువాత విరమించుకున్నారని తెలిపారు. వాంగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించిన తరువాతే సస్పెన్షన్‌లో ఉన్న సీఐ శంకరయ్యకు పోస్టింగ్ ఇచ్చారని పేర్కొన్నారు. సాక్ష్యం చెప్పేందుకు ముందుకొస్తున్నవారిని బెదిరించడంతో పాటు ప్రలోభాలకు గురిచేస్తున్నారని తెలిపారు. నిందితుల నుంచి తనకు ప్రాణహాని ఉందని అప్రూవర్‌గా మారిన దస్తగిరి మేజిస్ట్రేట్ ముందు స్టేట్‌మెంట్ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. గంగిరెడ్డి మినహా ఇతర నిందితులు జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారని కోర్టుకు తెలిపారు. నిందితుడి నుంచి సాక్షులకు ప్రాణహాని ఉందని చెబుతూ దర్యాప్తునకు విఘాఫూతం కలుగుతుందని చెప్పారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి…
కేవలం మూడు రోజుల యుద్ధంతో ఉక్రెయిన్ ప్రభుత్వం లొంగి వస్తుందని, ఆ దేశం తమ చెప్పుచేతలలో ఉంటుందనే అంచనాలతో యుద్ధం ప్రారంభించి మూడు వారాలు కావొస్తున్నా ఆ దేశం రాజీధోరణి ప్రదర్శించక పోవడంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ లో అసహనం వ్యక్తమవుతున్నది. ఈ సందర్భంగా ప్రపంచ దేశాలు విధిస్తున్న కఠినమైన ఆర్ధిక ఆంక్షలు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. చరిత్రలో ఎరుగని సంక్షోభకర పరిస్థితులను ఆ దేశ ప్రజలు ఎదుర్కొంటున్నారు. కొద్దిరోజుల్లో యుద్ధం ముగిసి, ఉక్రెయిన్ తమ స్వాధీనం అయినా నిలదొక్కుకోవడం కష్టమనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ యుద్ధం కారణంగా రష్యా ప్రజలలో తన ఇమేజ్ పెంచుకోవాలనుకున్న పుతిన్ ప్రజాదరణ సహితం బాగా దెబ్బతింటున్న సూచనలు కనిపిస్తున్నాయి. మరోవంక, భీకరంగా బాంబుల వర్షం కురిపిస్తున్న వెనుకడుగు వేయకుండా సాధారణ పౌరులు సహితం ఆయుధాలు చేబట్టి తమ సైన్యానికి తీవ్ర ప్రతిఘటన ఇస్తుండడం రష్యాను విస్మయానికి గురిచేస్తున్నది. ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్నా స్థానిక ప్రజల తిరుగుబాటు ఆగిపోదని, నిత్యం…
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుండి నరేంద్ర మోదీ ప్రభుత్వంకు భారీ మొత్తంలో డివిడెండ్లు అందుతున్నాయి. వరుసగా రెండో ఏడాది కూడా సవరించిన అంచనాలను మించిపోయాయి. ఆర్థిక కార్యాకలాపాలు పుంజుకోవడం, పెరుగుతున్న వస్తువుల ధరలు ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థలు లాభాన్ని చవిచూసేలా చేశాయి. పెట్టుబడులు, ప్రజా ఆస్తుల మేనేజ్‌మెంట్ విభాగం (డిఐపిఎఎం) డేటా ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, ఈ నెల మార్చి 13 నాటికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సిపిఎస్‌ఇలు) కేంద్రానికి రూ.49,059 కోట్లును డివిడెండ్ల రూపంలో చెల్లించాయి. ఈ డివిడెండ్ ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ సవరించిన అంచనా రూ. 46 వేల కోట్ల కన్నా ఎక్కువ. కరోనాకు ముందు 2019-20 సంవత్సరానికి గానూ తీసుకున్న డివిడెండ్లు రూ. 35,543 కోట్ల కన్నా ఈ ఏడాది ఇప్పటివరకు అందుకున్న డివిడెండ్లు 38 శాతం ఎక్కువ. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కూడా కేంద్రం రూ. 39,022 కోట్లను..…
భారత్-శ్రీలంక మధ్య జరిగిన పింక్ బాల్ రెండో టెస్టులోనూ భారత్ విజయం సాధించింది. బెంగళూరు వేదికగా జరిగిన ఈ టెస్టులో 238 పరుగుల తేడాతో బారత్ జట్టు ఘన విజయం సాధించింది. దీంతో 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0తేడాతో భారత్ కైవసం చేసుకుంది. భారత్ ఆటగాళ్లు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లోనూ చక్కని ప్రదర్శన కనబరిచారు. రోహిత్ శర్మకు కెప్టెన్‌గా ఇది తొలి టెస్టు విజయం. 447 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 208 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక కెప్టెన్ కరుణరత్నే సెంచరీతో మెరిసినా ఫలితం దక్కలేదు. ఇక భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు పడగొట్టగా, బుమ్రా మూడు, అక్షర్ పటేల్ రెండు వికెట్లు సాధించారు. భారత బ్యాట్స్ మెన్లలో శ్రేయస్ అద్భుతమైన షాట్లతో అలరించారు. మరో ఆటగాడు అయ్యర్ రెండు ఇన్నింగ్స్ లలో కూడా రాణించారు. అయ్యర్ తొలి ఇన్నింగ్స్‌లో 92…
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రాంతంలో 19 మంది మరణానికి కారణమైన కల్తీసారా, కల్తీమద్యం అంశం సోమవారం ఏపీ అసెంబ్లీని కుదిపేసింది.ఈ అంశంపై చర్చకు టిడిపి సభ్యులు వాయిదా తీర్మానం ఇవ్వగా స్పీకర్ అనుమతినివ్వలేదు. దీంతో టిడిపి శాసనసభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. వాయిదా తీర్మాన కాగితాలను చించి ఆయనపైకి విసిరేసారు. టిడిపి వైఖరిని వైసిపి తప్పుపట్టింది. చర్చ జరపకుండా ప్రతిరోజు టిడిపి సభకు అడ్డుపడుతోందంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. టిడిపి సభ్యుల ఆందోళనతో సభ పదే పదే వాయిదా పడింది. దానితో ఐదురుగు సభ్యులను బడ్జెట్ సమావేశాల చివరి వరకు సస్పెండ్ చేశారు. బుచ్చయ్యచౌదరి, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, బాల వీరాంజనేయులను సెస్పెన్షన్ చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్ సమావేశాల చివరి వరకూ వీరిపై సస్పెన్షన్ విధించారు. టీడీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో…
గత 19 రోజులుగా భీకర యుద్ధం సాగుతూన్నా ఆర్కైన్ లొంగుబాటు ధోరణి ప్రదర్శించక పోవడం పట్ల రష్యా అసహనంగా ఉన్నట్లు తెలుస్తున్నది. సరిహద్దులు దాటుకుని ఉక్రెయిన్ నగరాలను వరుసగా ఆక్రమించుకుంటూ దూసుకెళ్తున్న రష్యా సేనలకు రాజధాని కీవ్ లో మాత్రం ఉక్రెయిన్ సైన్యం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. తమ రాజధాని నగరాన్ని కాపాడుకునేందుకు సామాన్య పౌరులు సైతం ఆయుధాలు చేతబట్టి పోరాడుతుండటం రష్యాకు విస్మయం కలిగిస్తున్నది. ఎంతగా శ్రమిస్తున్నా కీవ్ ను రష్యా తమ చేతిలోకి తెచ్చుకోలేకపోతోంది. అమెరికా, నాటో దేశాల నుంచి మిస్సైల్స్, ఇతర ఆయుధాలు అందుతుండడంతో వెనక్కి తగ్గేదే లేదంటే ఉక్రెయిన్ పోరాటం సాగిస్తోంది. ఈ క్రమంలో రష్యా కూడా ఆయుధ సాయం కోసం ప్రయత్నిస్తోందని అమెరికా అధికారి ఒకరు చెబుతున్నారు. చైనా నుంచి సైనిక పరికరాలను సాయంగా కోరినట్లు తెలిపారు. రష్యా యుద్ధం, ఆ దేశంపై ఆర్థిక ఆంక్షల ద్వారా ఒత్తిడి లాంటి అంశాలపై ఇవాళ రోమ్ లో అమెరికా, చైనా…
పాకిస్థాన్‌లోని మియాన్ చిన్నూ సమీపంలో ఈ నెల 9న భారత క్షిపణి పేలడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది పొరపాటున పేలి ఉండకపోవచ్చని, భారత సేనలు ఉద్దేశ్యపూర్వకంగా కూడా పేల్చి ఉండకపోవచ్చని స్పష్టం అవుతున్నది. దానితో దీని వెనుక విద్రోహ చర్య ఉన్నదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాంకేతిక లోపం వల్ల ప్రమాదవశాత్తు క్షిపణి పాక్ భూభాగంలో పడిందని, దీనిపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించామని భారత్ ఇప్పటికే తెలియజేసింది. కానీ భారత సైన్యం ఈ దుర్ఘటనపై అత్యున్నత స్థాయిలో `కోర్ట్ అఫ్ ఎంక్వయిరీ’ జరిపిస్తూ ఉండడంపై విద్రోహ చర్య కావచ్చనే అనుమానాలే కారణమని పలువురు భావిస్తున్నారు. రొటీన్ నిర్వహణ లో భాగంగా మార్చి నెల 9 వ తేదీన బ్రహ్మోస్ మిసైల్ సిస్టంని సిద్ధం చేసే యత్నంలో ఫైర్ అయిపొయిందని చెబుతున్నారు. అయితే ఇదేమీ చిన్న తప్పు కాదు. పంజాబ్ లోని సిర్సా పట్టణానికి దూరంగా మిసైల్ టెస్ట్ రేంజ్ ఉంది. ఇక్కడ బ్రహ్మోస్ మిసైల్…