లవ్ జిహాద్ చట్టం కింద ఉత్తర్ ప్రదేశ్ లో మొట్టమొదటి తీర్పు వెలువడింది. ‘లవ్ జిహాద్’ చట్టం కింద మొదటిసారి కాన్పూర్ యువకుడికి 10 ఏళ్ల జైలు, రూ.30వేల జరిమానా విధిస్తూ కాన్పూర్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జావేద్ అనే ముస్లిం యువకుడు తనను తాను మున్నాగా పరిచయం చేసుకొని, ఒక బాలికను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చాడు. ఆ తర్వాత జావేద్ బాలికను తీసుకొని పారిపోయాడు. ఈ సంఘటన 2017 మే నెలలో జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మరుసటి రోజు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. తనకు కాబోయే భర్త ఇంటికి చేరుకున్నప్పుడే జావేద్ ముస్లిం అని తెలిసిందని, నిఖా చేసుకుందామని అడిగాడని, దానికి తాను నిరాకరించానని బాలిక పోలీసులకు తెలిపింది. తనపై యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని కూడా ఆమె ఆరోపించింది. దీంతో జావేద్‌పై పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి,…
Author: Editor's Desk, Tattva News
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చకపోవడంపై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. జీవోలు జనానికి తెలియాల్సిన అవసరం ఉందని, ఒకోసారి జీవోలను చూసిన జనం అందులోని అవకతవలను బట్టబయలు చేసేందుకు ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడింది. ప్రభుత్వ ఉత్తర్వుల గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని, సమాచార హక్కు చట్టం స్ఫూర్తిని ప్రభుత్వం దెబ్బతీయరాదని ఘాటు వ్యాఖ్య చేసింది. వెబ్‌సైట్‌లో పెట్టడం ఎంతోకాలంగా వస్తోందని, సాఫీగా జరిగే ఈ ప్రక్రియను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించింది. వెయ్యి, రెండు వేల రూపాయల టీఏ, డీఏ బిల్లుల జీవోలే ఒకోసారి పెద్ద అంశాలుగా వెలుగులోకి వచ్చేందుకు వీలుంటుందని, అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పింది. ఉద్యోగులను డిస్మిస్ చేసిన సంఘటనలు ఉన్నాయని గుర్తు చేసింది. గోప్యం, రహస్యంగా ఉంచడం కుదరదని తేల్చి చెప్పింది. జీవోలన్నింటినీ వెబ్‌సైట్‌లో పెట్టే అంశంపై పూర్తి వివరాలను ఈ నెల 28న జరిగే విచారణలోగా నివేదించాలని చీఫ్…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలకు సిద్ధమవుతున్నాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్లో గుంపులుగా చేరితే వైరస్ మరింత వేగంగా వ్యాపించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఉత్సవాలపై ఆంక్షలు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే దాదాపు 15 రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు నమోదైన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఓ వైపు వ్యాక్సినేషన్ వేగవంతం చేస్తూ.. మరో వైపు కరోనా వ్యాప్తి కట్టడి కోసం ఆంక్షలు పెడుతున్నాయి. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలను ప్రకటించగా, తాజాగా ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలు ప్రకటించాయి. దేశ రాజధాని పరిధిలో గుంపులుగా చేరి క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవడంపై నిషేధం విధిస్తూ ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (డీడీఎంఏ) ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు పక్కాగా అమలయ్యేలా ఢిల్లీ పోలీసులు, జిల్లా అధికారులు…
మయన్మార్‌లో కొండ చరియలు విరిగిపడి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 25 మంది గాయపడగా.. మరో 70 మందికి పైగా గల్లంతయ్యారు. ఉత్తర మయన్మార్‌లోని కచిన్ రాష్ట్రం జడేమైన్ వద్ద బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు కొండచరియలు విరిగిపడ్డాయి. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు, పోలీసులు, రెస్క్యూ బఅందాలు గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గల్లంతైన వారి కోసం సుమారు 200 మంది సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మరికొంత మంది సమీపంలోని సరస్సులో బోట్ల సాయంతో వెతుకుతున్నారు. కొండచరియలు విరిగిపడటంతో తెల్లవారుజామున 70 మందికి పైగా మైనర్లు సరస్సులో కొట్టుకుపోయారని ఈ ప్రయత్నాన్ని సమన్వయం చేస్తున్న గయునార్ రెస్క్యూ టీమ్ అధికారి న్యో చావ్ తెలిపారు. లోనెఖిన్ గ్రామం చుట్టూ ఉన్న అనేక గనుల నుండి భూమి, వ్యర్థాలు 60 మీటర్లు (సుమారు 200 అడుగులు) ఒక కొండపైకి జారి మైనర్లను తాకినట్లు అతను చెప్పాడు.కనీసం ఐదుగురు…
దేశంలో ఉన్న చైనీస్ మొబైల్ కంపెనీలపై ఆదాయపన్ను శాఖ సోదాలు నిర్వహిస్తోంది. పన్నులను ఎగవేసేందుకు ఆయా కంపెనీలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఇప్పటి కే పలు దర్యాప్తు సంస్థలు చైనా కంపెనీలపై నిఘా పెట్టాయి. గతంలో చైనా సంస్థలు నిర్వహిస్తున్న మొబైల్ లోన్ అప్లికేషన్, ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారాలపై పలు ఏజెన్సీలు దాడులు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరికొన్ని చైనా సంస్థలపై తనిఖీలు మొదలయ్యాయి. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి ఐటీశాఖ ఆధ్వర్యంలో పలు బృందాలు దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నాయి. తయారీ సంస్థలతో పాటు పలు కార్పొరేట్ సంస్థలపై దాడులు జరుగుతున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఢిల్లీ, గురుగ్రామ్, ముంబయి, బెంగళూరు తదితర నగరాల్లో కూడా ఈ దాడులు జరుగుతున్నాయి. దేశంలో ఒప్పో, షావోమీ సంస్థలకు చెందిన పంపిణీదారు భాగస్వాముల ఆఫీసులు, ఈ కంపెనీల్లో పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగులు, డైరెక్టర్లు, సీఎఫ్‌వో తదితరుల కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నట్లు…
ముస్లింలు అధికంగా గల జిల్లాలతో పాకిస్థాన్ ను అనే కొత్త దేశాన్ని ఏర్పాటు చేస్తూ బ్రిటిష్ వారు భారత్ విభజనకు పూనుకోవడానికి ముందు నుంచే నేటి బాంగ్లాదేశ్ ప్రాంతంలో ఉన్న ప్రజలలో పాకిస్థాన్ లో కలవడం పట్ల ఏమాత్రం సుముఖత లేదు. పైగా దేశ విభజనకు ముందు స్వతంత్ర ఐక్య బెంగాల్ కోసం 1946లో ప్రధాన మంత్రి హుసేన్ షహీద్ సుహ్రావర్దీ ప్రతిపాదించగా వలస పాలకులు వ్యతిరేకించారు. తూర్పు పాకిస్తాన్ పునరుజ్జీవన సంఘం తూర్పు బ్రిటిష్ భారత్ లో సార్వభౌమ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. రాజకీయ చర్చల తర్వాత ఆగష్టు 1947లో పాకిస్తాన్, భారతదేశం అనే రెండు దేశాల ఆవిర్భావానికి దారితీసింది. బ్రిటీష్ వారి నిష్క్రమణ తరువాత వరుసగా ముస్లింలు, హిందువులకు శాశ్వత నివాసాలను అందించారు. పాకిస్తాన్ భూభాగం భారత్ కు తూర్పు, పశ్చిమ ప్రాంతాలలో రెండు భిన్నమైన భౌగోలిక, సాంస్కృతిక ప్రాంతాలతో ఏర్పడడంతో కలసి ఉండడం సాధ్యం కాలేదు. రెండు ప్రాంతాలలో జనాభా దాదాపు సమానంగా ఉన్నప్పటికీ, రాజకీయ అధికారం పశ్చిమ పాకిస్తాన్‌లో కేంద్రీకృతమై ఉంది. తాము ఆర్ధికంగా విస్తృతంగా దోపిడీకి…
జమ్ము ప్రాంతంలో అదనంగా ఆరు అసెంబ్లీ స్థానాలు, కాశ్మీర్‌కి ఒక అదనపు స్థానాన్ని కేటాయించాలని డీలిమిటేషన్ కమిషన్ చేసిన ప్రతిపాదన రాష్ట్ర జనాభా ప్రాధమిక ప్రమాణాలను విస్మరించిందని అంటూ పీపుల్స్ అలయన్స్ ఫర్ గూప్కర్ డిక్లరేషన్ పార్టీలు తిరస్కరించడం వారిలో రాజకీయ అభద్రతా భావాన్ని వెల్లడి చేస్తుంది. ఈ ప్రతిపాదనలు అమలులోకి వస్తే 75 శాతం ముస్లిం మెజారిటీ జనాభా కలిగిన రాష్ట్రంలో “కాశ్మీరీ నాయకుడు” ఇంకెప్పుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాదనీ వారు భయపడుతున్నట్లు వెల్లడవుతుంది. వాస్తవానికి కాశ్మీరీ నాయకులు ఢిల్లీలో తమకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని ఇప్పటి వరకు జనాభా దామాషాకు మించి జమ్మూ కన్నా కాశ్మీర్ లోనే ఎక్కువ సీట్లు అసెంబ్లీ ఉండేటట్లు చేసుకోగలుగుతున్నారు. అందుకనే ఇప్పటి వరకు కాశ్మీరీ నాయకులే ముఖ్యమంత్రులు అవుతున్నారు. కానీ ఇప్పుడా పరిస్థితి మారటం అనివార్యంగా కనిపిస్తున్నది. “జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి కావాలనే ఆశయంతో ఉన్న ఏ కాశ్మీరీ నాయకుడైనా కలలు కనడం మానేయాలి. కాశ్మీరీల హక్కులను కాలరాయడంపై భారత…
“టీఆర్‌ఎ్‌సపై పోరాటం చేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎక్కడా వెనక్కి తగ్గొద్దు. ప్రజలతో పాటు మీ దృష్టిని కూడా మళ్లించేందుకు ఆయన (కేసీఆర్) ప్రయత్నిస్తారు. ఆయన ట్రాప్‌లో పడవద్దు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించండి” అంటూ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తెలంగాణ బిజెపి నేతలకు మార్గనిర్ధేశం చేశారు. మంగళవారం వారితో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి అధికారమలోకి వచ్చే విధంగా ప్రజా పోరాటాలు జరపాలని సూచించారు. సీఎం కేసీఆర్ అవినీతికి సంబంధించిన అంశం నోటీసులో ఉందని చెబుతూ బీజేపీ నేతలను ఉరికించాలని, ఊళ్లలోకి రానీయవద్దంటూ టీఆర్‌ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయనమంగళవారం పార్లమెంటు భవనంలోని అమిత్‌షా చాంబర్‌లో జరిగిన సమావేశంలో ఈ ప్రత్యేక భేటీ జరిపినట్లు తెలుస్తున్నది. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కేసీఆర్ డ్రామాలు ఆడతారని, ఆ ఆటలను సాగనీయకుండా ముందుకు పోవాలని అమిత్ షా…
ఆధార్‌తో ఓటర్ల జాబితా అనుసంధానం చేయడానికి ఉద్దేశించిన బిల్లును పార్లమెంట్ ఉభయసభలు ఆమోదించాయి. అయితే ఈ బిల్లుపై ప్రతిపక్షాలు విమర్శలుపెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ బిల్లు ఒకే వ్యక్తి ఒకటికన్నా ఎక్కువ ప్రాంతాల్లో ఓటరుగా నమోదు చేసుకోవడం అనే ప్రధాన సమస్యను పరిష్కరిస్తుందని, ఓటర్ల జాబితాను చాలా వరకు ప్రక్షాళన చేస్తుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ బిల్లును సార్లమెంటు స్థాయీ సంఘానికి పంపించాలన్న ప్రతిపక్షాల డిమాండ్ మధ్య స్వల్ప చర్చ అనంతరం లోక్‌సభ సోమవారం ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత ప్రభుత్వం ఈ వివరణ ఇవ్వడం గమనార్హం. మంగళవారం రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. చాలా కాలంగా చర్చిస్తున్న వివిధ ఎన్నికల సంస్కరణలను ఈ బిల్లులో చేర్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతేకాదు, వివిధ ఎన్నికల సంస్కరణలపై గుర్తింపు పొందిన అన్నిజాతీయ, ప్రాంతీయ రాజకీయ పక్షాలతో చర్చల అనంతరం ఎన్నికల కమిషన్ చేసిన ప్రకటనను కూడా…
భారత్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న 20 యూట్యూబ్ ఛానళ్లు, రెండు వెబ్సైట్లను కేంద్రం నిషేధించింది. ఇవన్నీ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఇంటలిజెన్స్ ఏజెన్సీలు ఇచ్చిన సమాచారం మేరకు సమాచార, ప్రసార శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దేశ భద్రతకు సంబంధించి సున్నిత అంశాలపై అవాస్తవాలను ఈ ఛానెళ్లు ప్రచారం చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ యూట్యూబ్ ఛానళ్లు, వెబ్సైట్లలో కాశ్మీర్, ఇండియన్ ఆర్మీ, రామ మందిరం, మైనార్టీలు, సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్పై ఫేక్ న్యూస్ ప్రసారం చేసినట్లు కేంద్రం తెలిపింది. ప్రభుత్వం నిషేధించిన యూట్యూబ్ ఛానళ్లలో పూంచ్ లైన్, ఇంటర్నేషనల్ వెబ్ న్యూస్, ఖల్సా టీవీ, నేక్ డ్ ట్రూత్, 48 న్యూస్, ఫిక్షనల్, హిస్టారికల్ ఫ్యాక్ట్స్, పంజాబ్ వైరల్, నయా పాకిస్థాన్, గ్లోబల్, కవర్ స్టోరీ, గో గ్లోబల్, ఈ కామర్స్, జునైద్ హలీమ్ అఫీషియల్, తయ్యబ్ హనీఫ్, జైన్ అలీ అఫీషియల్, మోసిన్ రాజ్…